స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పరిమిత బడ్జెట్ లో మంచి క్వాలిటీతో సినిమాలను నిర్మించి ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో మిడిల్ రేంజ్ హీరోలతో ఎక్కువగా సినిమాలను నిర్మిస్తున్న దిల్ రాజు శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కు జోడీగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్నారు.
అయితే దిల్ రాజు శంకర్ కు షరతులు విధించారని పరిమిత బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించాలని శంకర్ కు సూచించారని గతంలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. బడ్జెట్ లో శంకర్ సినిమాను పూర్తి చేయకపోతే శంకర్ పారితోషికంలో దిల్ రాజు కోత విధిస్తారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెబుతున్నారు.
దిల్ రాజు ఒత్తిడి లేకుండానే దర్శకులతో పని చేయించడానికి ప్రాధాన్యత ఇస్తారని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. వచ్చే నెల 8వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. రామ్ చరణ్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కావాల్సి ఉంది.