Dil Raju Father:: టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తండ్రి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య ఎంత మాత్రం తగ్గడం లేదు. నిత్యం ఏదో ఒక బ్యాడ్ న్యూడ్ వింటూనే ఉన్నాం. సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నికల్ టీం, లేదు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు.. ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ కి చెందిన సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు, పక్క రాష్ట్రాల్లో ఉన్న సినీ ప్రముఖుల్లో కూడా ఎవరో ఒకరు మరణిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా..తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో కొద్దిరోజులుగా మంచానికే పరిమితమయ్యారట. మెరుగైన చికిత్స తీసుకున్నప్పటికీ లాభం లేకుండా పోయింది అని తెలుస్తుంది. శ్యామ్ సుందర్ రెడ్డి గారి వయసు 86 ఏళ్ళు.వయసు మీద పడటం వల్లే ఆయన అనారోగ్య సమస్యలను తట్టుకోలేకపోయారు అని స్పష్టమవుతుంది.

దిల్ రాజు తండ్రి మరణవార్తతో ఆయన కుటుంబంలో మాత్రమే కాకుండా టాలీవుడ్ సినీ పరిశ్రమలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ 2023 లో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘వారసుడు’ చిత్రం సూపర్ హిట్ అవ్వగా ‘బలగం’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ‘శాకుంతలం’ సినిమా మాత్రం నిరాశపరిచింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus