Dil Raju,Nikhil: మీకు తెలిస్తే రాయండి.. లేదంటే మూసుకోండి: దిల్ రాజు

‘కార్తికేయ 2′ రిలీజ్ కు ముందు హీరో నిఖిల్.. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన సినిమా(కార్తికేయ 2’) ని రిలీజ్ చేయకుండా అడ్డుకుంటున్నారు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఇలా చేస్తుంది దిల్ రాజే అంటూ చాలా ఊహాగానాలు వచ్చాయి. వాటిపై ‘కార్తికేయ 2’ సక్సెస్ మీట్లో దిల్ రాజు స్పందించాడు. ఆయన మాట్లాడుతూ… “జూలై 8న ‘థాంక్యూ’ మూవీ రిలీజ్ చేసుకుందాం అనుకున్నాం. కానీ ఆ టైంకి సినిమా ఇంకా రెడీ అవ్వలేదు. అప్పుడు నిర్మాత వివేక్ కు ఫోన్ చేసి జూలై 22న మీ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

ఆ డేట్ కు మా సినిమాని రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నాను అని చెప్పాను. దానికి వాళ్ళు అభ్యంతరం లేదు అని చెప్పారు. మా మధ్య చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. కానీ బయటకు మాత్రం అది వేరే విధంగా వెళ్తుంది. ‘కార్తికేయ 2’ రిలీజ్ డేట్ కు ‘థాంక్యూ’ ఇవ్వాలి అనుకున్నాం.. నిర్మాత,దర్శకులతో మాట్లాడాను. దర్శకుడు చందు.. నాగ చైతన్యతో ఆల్రెడీ సినిమాలు చేసి ఉన్నాడు. కాబట్టి క్లాష్ వద్దు వేరే డేట్ కు వెళ్తాము అని అన్నాడు. అక్కడికి మా సమస్య అయిపోయింది.’కార్తికేయ2′ దర్శకుడు, హీరో కి… నేను నా తరుపున ఏ సహాయం కావాలి అన్నా చేస్తాను అని ఆ టైంలో అన్నాను.

ఆగస్టు 5న రావాలి అనుకున్నారు.ఆ టైంకి రెండు సినిమాలు వస్తున్నాయి. వాటికి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది.. ఆలోచించండి అని అన్నాను.తర్వాత వాళ్ళు ఆగస్టు 12 అనుకున్నారు. ఆ రోజు కూడా రెండు సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. కానీ ఆగస్టు 13న ‘కోబ్రా’ పోస్ట్ పోన్ అయ్యింది. ఆ టైంకి వద్దామనుకుంటున్నాం అని చెప్పారు. అందుకు ఓకే అన్నాను. ఈ గ్యాప్ లో ఎవడికి నచ్చినట్టు వాడు రాస్తూనే ఉన్నాడు.’ ‘కార్తికేయ 2′ సినిమాని తొక్కేస్తున్నాడు దిల్ రాజు అంటూ రాసేశారు’. సినిమాని ఎవ్వడూ తొక్కుకోడు. ఓ సినిమా బాగా ఆడింది అంటే తర్వాత ఇంకా మంచి సినిమా తీయాలనే ఆలోచన మాకు వస్తుంది.

‘హ్యాపీడేస్’ సినిమా నుండి నిఖిల్ నాకు బాగా క్లోజ్. నా గురించి ఇలాంటి వార్తలు చాలా వస్తాయి. కానీ నేను ఓపిక పడతాను. పెద్ద వాళ్ళు చెబుతుంటారు..ఇలాంటివి వచ్చినప్పుడు నువ్వేమీ మాట్లాడొద్దు అని…!నేను కామ్ గోయింగ్ పర్సన్..! అందుకే ఎక్కువగా సైలెంట్ గా ఉంటాను. దిల్ రాజు బొమ్మ ఉంటే తప్ప మీకు క్లిక్ లు పడవు, సబ్స్క్రైబర్లు పెరగరు.ఈ విషయం జనాలకు తెలీక మా నిర్మాతల మధ్య గొడవలు ఉన్నాయి అనుకుంటారు. సినిమా అంటే నాకు ప్రేమ. పైగా ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ అనేది టాప్ బ్యానర్. ఆ సంస్థ రూపొందించిన సినిమాని నేను తొక్కడం ఏంటి అనే విషయం పై కనీసం ఆలోచించకుండా రాసేస్తున్నారు.

మీకు తెలిస్తే రాయండి లేదా తెలుసుకొని రాయండి. లేదంటే మూసుకోండి” అంటూ దిల్ రాజు అగ్రెసివ్ గా స్పందించారు. అంతా బాగానే ఉంది కానీ…. మరి హీరో నిఖిల్ ఎందుకు ‘ ‘కార్తికేయ 2′ చిత్రాన్ని రిలీజ్ కాకుండా చేస్తున్నారు’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. దిల్ రాజు అన్నట్టు ఇది పెద్ద బ్యానరే కదా. పరోక్షంగా జనాలను రెచ్చగొట్టింది ఓ రకంగా హీరోనే కదా.! అతని ఇంటర్వ్యూని దిల్ రాజు చూడలేదా.? ‘అటు తిప్పి ఇటు తిప్పి మీడియాని బ్లేమ్ చేయడం సినీ పెద్దలకు అలవాటే’ అనే విషయం కూడా చాలా మంది జనాలకు తెలీదు అనే చెప్పాలి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus