Dil Raju: దిల్ రాజుకు అఖండ లాభం అన్ని కోట్లా?

పుష్ప ది రైజ్, అఖండ సినిమాలలో ఏ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అనే ప్రశ్నకు పుష్ప ది రైజ్ పేరు సమాధానంగా వినిపిస్తుంది. అఖండ సినిమా సాధించిన కలెక్షన్లతో పోల్చి చూస్తే పుష్ప సినిమా రెట్టింపు కలెక్షన్లను సాధించింది. అయితే బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందించిన సినిమా ఏదనే ప్రశ్నకు మాత్రం అఖండ పేరు సమాధానంగా వినిపిస్తుండటం గమనార్హం. అఖండ సినిమా నైజాం హక్కులను దిల్ రాజు 10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు.

అయితే అఖండను 10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి దిల్ రాజు తప్పు చేశారని కామెంట్లు వినిపించాయి. అఖండకు ముందు బాలయ్య నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఈ కామెంట్లు వినిపించగా నైజాంలో గతంలో బాలయ్య సినిమాలకు హిట్ టాక్ వచ్చినా భారీ స్థాయిలో కలెక్షన్లు మాత్రం రాలేదు. అయితే అఖండ మాత్రం నైజాంలో 20 కోట్ల రూపాయల షేర్ మార్క్ ను టచ్ చేయడం గమనార్హం. హాట్ స్టార్ లో అఖండ మూవీ స్ట్రీమింగ్ అవుతుండటంతో అఖండ థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసినట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఫుల్ రన్ లో అఖండ 74 కోట్ల రూపాయల మార్క్ ను టచ్ చేసింది. పుష్ప ది రైజ్ హిందీ హక్కులను కూడా దిల్ రాజే కొనుగోలు చేశారు. ఈ సినిమా హక్కుల కోసం దిల్ రాజు ఏకంగా 35 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. నైజాంలో ఈ సినిమా ఫుల్ రన్ లో 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. పుష్ప ది రైజ్ సినిమాకు తొలిరోజు వచ్చిన టాక్ ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేనని కామెంట్లు వినిపించాయి.

అయితే బన్నీ తన నటనతో సుకుమార్ టేకింగ్ తో పుష్ప ది రైజ్ ను సక్సెస్ చేశారు. పుష్ప ది రైజ్ కు కొనసాగింపుగా పుష్ప ది రూల్ తెరకెక్కనుండగా అఖండ మూవీకి కూడా సీక్వెల్ తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. బాలయ్య సినిమాతో దిల్ రాజుకు పది కోట్ల రూపాయల లాభం వస్తే బన్నీ సినిమాతో కేవలం 5 కోట్ల రూపాయల లాభం వచ్చింది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus