Dil Raju :‘మైత్రి’తో థియేటర్ల పోరు… దిల్ రాజు ‘బాలీవుడ్‌’ ప్లాన్‌!

నైజాం ఏరియాలో సినిమా విడుదల చేయాలి అంటే చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. అయితే అందులో పెద్ద సినిమాలు రిలీజ్‌ చేసే టాప్‌ డిస్ట్రిబ్యూటర్లు అంటే చాలా తక్కువమందే కనిపిస్తారు. అందులోనూ ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్నవాళ్లు అంటే ఇంకా తక్కువ కనిపిస్తారు. అయితే తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో డిస్ట్రిబ్యూటర్ వచ్చారు. వాళ్లే మైత్రీ మూవీ మేకర్స్‌. అగ్ర నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న మైత్రీ టీమ్‌ ఇప్పుడు పంపిణీ రంగంలోకి కూడా వచ్చింది.

ఎక్కడా అఫీషియల్‌గా చెప్పలేదు కానీ ప్రభాస్‌ – ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌’ సినిమాను నైజాం ఏరియా పంపిణీ హక్కులను మైత్రీ టీమ్‌ దక్కించుకుందని సమాచారం. దీంతో నైజాం ఏరియాలో అగ్ర పంపిణీదారు అయిన దిల్‌ రాజుకు చెక్‌ పెట్టినట్లే అంటూ సోషల్‌ మీడియాలో మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మైత్రికి చెక్‌ పెట్టడానికి దిల్ రాజు భారీ ప్లాన్‌ వేశారు అని చెబుతున్నారు. దీని కోసం ఓ బాలీవుడ్‌ సినిమాను రంగంలోకి దింపుతున్నారని టాక్‌.

‘సలార్‌’ సినిమాకు పోటీగా వస్తున్న సినిమా అంటే అది ‘డంకీ’ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షారుఖ్‌ ఖాన్‌ – రాజ్‌ కుమార్‌ హిరాణీ కాంబినేషన్‌లో రూపొందిన ఆ సినిమా తెలుగు హక్కులను దిల్‌ రాజు కైవసం చేసుకున్నారని అంటున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. ‘పఠాన్‌’, ‘జవాన్‌’ లాంటి వరుస విజయాలతో జోరు మీదున్న షారుఖ్‌ త్వరలో ‘డంకీ’ వస్తున్నాడు. హ్యాట్రిక్‌ విజయం ఇస్తుందని టీమ్‌, ఫ్యాన్స్‌ బలంగా నమ్ముతున్నారు.

ఈ సమయంలో సినిమాను పాన్‌ ఇండియా రేంజిలో విడుదల చేయబోతున్నారు. అందుకే తెలుగులో రిలీజ్‌ చేయడానికి దిల్‌ రాజు ముందుకొస్తున్నారట. ‘డంకీ’ని తెలుగు ప్రేక్షకులకు అందించడం, ‘మైత్రి’కి చెక్‌ పెట్టడం లాంటి రెండు పనులు ఒకేసారి అయిపోతాయి ఈ స్టెప్‌తో అంటున్నారు. ‘డంకీ’ సినిమా డిసెంబరు 21న వస్తుండగా… ఆ తర్వాత అంటే 22న ‘సలార్‌’ను తీసుకొస్తున్నారు. మరి ఈ ఫైట్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

 

 

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus