దిల్ రాజు ప్లానింగ్ బాగుంటుంది… ఆ మాటకొస్తే చాలా బాగుంటుందని అని చెప్పడానికి ఆయన చేసిన సినిమాలే నిదర్శనం. నిర్మాతగా చిన్న సినిమాలూ చేసినప్పటికీ… ఎక్కువగా పెద్ద సినిమాలు ఉండటంతో భారీ నిర్మాత అనిపించుకుంటున్నారు. అలా హాఫ్ సెంచరీ కొట్టేశారు. ఇప్పుడు సెంచరీ కోసం గేరు మార్చిన బ్యాట్స్‌మన్‌లా వేగం పెంచారు దిల్ రాజు. అంతే కాదు భారీ షాట్లు కూడా ఆడుతున్నారు. అసలు ఇలా భారీ సినిమాలు చేయడానికి ఆయన ధైర్యం ఏంటి?
డిస్ట్రిబ్యూటర్‌గా పరిశ్రమలోకి ఎంటర్ అయిన దిల్ రాజు… ఒక్కో మెట్టు ఎక్కుతూ నిర్మాత అయ్యారు. ఆ తర్వాత భారీ చిత్రాల నిర్మాత అయ్యారు. ఇప్పుడు దానిని డబుల్, ట్రిపుల్ చేయడానికి తెలుగు హీరోలతోపాటు, తమిళ హీరోలనూ తన బ్యానర్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తన బ్యానర్‌లో 50వ సినిమాగా రామ్‌చరణ్ – శంకర్ సినిమాను అనౌన్స్ చేశారు. మరోవైపు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ సినిమా ఓకే చేసుకున్నారు. తాజాగా బోయపాటి డైరక్షన్‌లో సూర్యని నటింపజేయాలని చూస్తున్నారు. అన్నట్లు ప్రశాంత్ నీల్ డైరక్షన్‌లో ఓ స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా అంటున్నారు.
ఇదంతా చూస్తుంటే… ఏంటీ వరుస భారీ ప్రాజెక్టులు, దిల్ రాజు ధైర్యం ఏంటో అసలు అని అందరూ ఆలోచిస్తున్నారు. కథలపై దిల్ రాజు పట్టు ఎక్కువ అనేది చాలామందికి తెలిసిన విషయమే. అందుకే ఆయన సెలక్షన్ చాలా తక్కువసార్లు మిస్ ఫైర్ అవుతుంటుంది. మరోవైపు ఆయన ఎంచుకుంటున్న దర్శకులు, హీరోలు టాప్ ప్లేస్‌లో ఉన్నవాళ్లే . కాబట్టి తన సినిమాకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఇంకొకటి ఆయన పీఆర్ టీమ్… సినిమాకు హైప్ ఇవ్వడంలో దిల్ రాజు టీమ్ స్థాయే వేరు. ఇదేనా ఆయన ధైర్యం?
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?