Allu Arjun: బన్నీ సినిమా కోసం దిల్‌ రాజు ఇంకో ప్లాన్‌

దిల్‌ రాజు దగ్గర అల్లు అర్జున్‌ డేట్స్‌ ఉన్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ‘ఐకాన్‌’ పేరుతో ఓ సినిమా చేస్తామని కూడా చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అయితే వేణు శ్రీరామ్‌ మీద నమ్మకం లేకనో, కథ మీద నమ్మకం లేకనో బన్నీ ఆ సినిమాను వాయిదా వేస్తూ వస్తున్నాడు. తాజాగా ‘వకీల్‌ సాబ్‌’తో హిట్‌ కొట్టడంతో మరోసారి వేణు శ్రీరామ్ ‘ఐకాన్‌’ ముందుకొచ్చింది. అల్లు అర్జున్‌ కూడా చేసేందుకు సిద్ధం అనే వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో నాలుగు రోజులకే ఆ బజ్‌ ఆగిపోయింది. ఇప్పుడు చూస్తే ఆ ప్లేస్‌లో మరో డైరక్టర్‌ వచ్చాడంటున్నారు.

‘ఐకాన్‌’ సినిమా అనౌన్స్‌ అయ్యింది… ఆ తర్వాత బన్నీ చాలా సినిమాలు చేశాడు. ఇప్పుడు ‘ఐకాన్‌ స్టార్’ కూడా అయిపోయాడు. ఇంకా ‘ఐకాన్‌ ’ మొదలవ్వలేదు. అయితే కొత్త కబురు ఏంటంటే ‘ఐకాన్‌’ ఇక వచ్చే పరిస్థితి లేదంటున్నారు. వేణు శ్రీరామ్‌ ఆ కథను వేరే హీరోకి ఇచ్చేయడమే అంటున్నారు. దీంతో దిల్‌ రాజు మరో దర్శకుణ్ని పట్టుకునే పనిలో ఉన్నారట. ఈ క్రమంలోనే అనిల్‌ రావిపూడి పేరు వినిపిస్తోంది. దిల్‌ రాజు, అనిల్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. అడగ్గానే ఒప్పుకుంటానే అనుకుంటున్నారు.

మరోవైపు అల్లు అర్జున్‌ 21వ సినిమా విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. కొరటాల తప్పుకోవడంతో మరుగదాస్‌తో సినిమా అంటున్నారు. అయితే ఇంకా అధికారికంగా ఓకే అవ్వలేదు. మరోవైపు అనిల్ రావిపూడి – బాలయ్య ప్రాజెక్టు కూడా ఇంకా ఓకే అవ్వలేదు. ‘పుష్ప’ తర్వాత బన్నీ, ‘ఎఫ్‌ 3’ తర్వాత అనిల్‌ రావిపూడి ఖాళీనే. దీంతో ఈ ఇద్దరినీ కలిపేసి సినిమా చేసే యోచనలో దిల్‌ రాజు ఉన్నారట. మరి దీనికి అల్లు అర్జున్‌ ఏమంటాడో చూడాలి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus