Dil Raju: ‘ఎఫ్3’ రిజల్ట్ టాలీవుడ్ నిర్మాతలకు కొత్త దారి చూపిస్తుంది..!

‘ఎఫ్ 3’ మూవీ శుక్రవారం నాడు అంటే మే 27న విడుదలైంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ మొదటి వీకెండ్ సూపర్ కలెక్షన్స్ ను సాధించింది. వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.34.25 కోట్ల షేర్ ను రాబట్టింది.రూ.64 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది కాబట్టి ఇంకో రూ.29.75 కోట్ల షేర్ ను సాధిస్తే బ్రేక్ ఈవెన్ సాధించినట్టే. సోమవారం రోజున కూడా బుకింగ్స్ బాగున్నాయి.

అనిల్ రావిపూడి అకౌంట్లో మరో కమర్షియల్ హిట్టు పడడం గ్యారెంటీ అనే చెప్పాలి. ఇదంతా టికెట్ రేట్ల విష‌యంలో దిల్ రాజు తీసుకున్న స్ట్రాట‌జీ వల్లే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఎటువంటి హైక్స్ లేకుండా సాధార‌ణ టికెట్ రేట్ల‌తోనే ‘ఎఫ్3 చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. నిజానికి అవి కూడా తక్కువ రేట్లేమీ కాదు. మల్టీప్లెక్సుల్లో రూ.295 ప్లస్ జీఎస్టీ, సింగిల్ స్క్రీన్స్ లో రూ. 175 ప్లస్ జీఎస్టీ వరకు టికెట్ రేట్లు ఉన్నాయి.

అయితే ‘రాధే శ్యామ్’ ‘ఆచార్య’ ‘సర్కారు వారి పాట’ చిత్రాలకంటే కూడా ‘ఎఫ్3’ కి ఆఫ్ లైన్ బుకింగ్స్ బాగా అవుతున్నాయి. దీంతో పెద్ద సినిమాలకి రూ.300 వరకు టికెట్ రేట్లు పెట్టడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని ప్రూవ్ అయ్యింది. సినిమాని సామాన్య ప్రేక్ష‌కుల‌కు అందుబాటులో ఉండాల‌న్న ఉద్దేశంతో… దిల్ రాజు ఈ నిర్ణ‌యం తీసుకున్నట్టు స్పష్టమవుతుంది. ఇదే నిర్ణయం `స‌ర్కారు వారి పాట‌`, `ఆచార్య‌` చిత్రాలకి తీసుకుంటే ఇంకా బాగుండేది.

‘ఆచార్య’ ను పక్కన పెట్టేసినా ‘సర్కారు వారి పాట’ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది కాబట్టి ఆ చిత్రానికి టికెట్ రేట్లు తగ్గించి ఉండి ఉంటే భారీ కలెక్షన్లు నమోదయ్యాయి. ఇక ఈ వారం విడుదల కాబోతున్న `మేజ‌ర్‌` కు మరింతగా టికెట్ రేట్లు తగ్గించారు. క‌మ‌ల్ హాస‌న్ `విక్ర‌మ్‌` కు కూడా అదే స్ట్రాటజీని అనుసరిస్తే జనాలు హ్యాపీగా థియేటర్లకే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారు అనడంలో అతిశయోక్తి లేదు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus