ఓ నాలుగేళ్ల నుండి నేచురల్ స్టార్ నాని (Nani) ఓ భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. అదే తనను తాను పాన్ ఇండియా హీరో చేసుకుందామని. ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) సినిమా సౌత్‌లోని అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. సినిమా అయితే రిలీజ్ అయింది కానీ.. ఇతర భాషల్లో ఆ స్థాయి స్పందన అందుకోలేదు. ఆ తర్వాత ఆయనకు నమ్మకం ఉన్న ప్రతి సినిమాను అలానే పాన్ ఇండియా రిలీజ్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఏదీ వర్కవుట్ కాలేదు.
నాని సినిమాలకు తెలుగులో మంచి విజయం అందుతున్నా.. పాన్ ఇండియా ముచ్చట అయితే తీరడం లేదు. అయితే ఇప్పుడు ఓ రెండు అడుగులు ముందుకు వేసి తన కొత్త సినిమాను ఏకంగా ఆరు భాషల్లో రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ గురించే ఇదంతా. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాళీ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట నాని.
నాని – సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘పారడైజ్’. ఈ సినిమా గ్లింప్స్ వీడియో నాని పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తారు అని వార్తలు వచ్చినా రాలేదు. ఇప్పుడు ఆరు భాషల లీక్ వచ్చింది. ఆ రోజు క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు. ఇక ఇప్పుడు చేస్తున్న ‘హిట్ 3’ (HIT3) సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నాడట.
ఇదంతా చూస్తుంటే నాని పాన్ ఇండియా హీరోగా మారేంతవరకు ఊరుకునేలా లేడు. ‘దసరా’ (Dasara) సినిమాతో కాస్త పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు. మొన్నీమధ్య వచ్చిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) ఓటీటీ పుణ్యమా అని పాన్ ఇండియా లెవల్‌లోకి వెళ్లింది. అయితే ఇంకా పూర్తి పాన్ ఇండియా స్టార్ అవ్వలేదు. మరి రాబోయే సినిమాలతో నాని ముచ్చట తీరుతుందేమో చూడలి.