Dil Raju: పవన్, మహేష్ సినిమాల వల్ల దిల్ రాజుకు అంత నష్టమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ నిర్మాతగా దిల్ రాజు పేరు వినిపిస్తుంది. ఒకవైపు వరుసగా స్టార్ హీరోలతో సినిమాలను నిర్మిస్తూ మరోవైపు క్రేజ్ ఉన్న సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తూ రెండు పడవల ప్రయాణం చేస్తూనే దిల్ రాజు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ అయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ తాను నష్టపోయిన సినిమాలకు సంబంధించి షాకింగ్ కామెంట్లు చేశారు. స్పైడర్, అజ్ఞాతవాసి సినిమాలు డిస్ట్రిబ్యూటర్ గా తనకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చాయని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

నా స్థానంలో మరో వ్యక్తి ఉండి ఉంటే ఆత్మహత్య చేసుకోవడమో లేక ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడమో చేసేవారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను నిర్మాతగా నిర్మించిన సినిమాలు సక్సెస్ సాధించడం వల్లే ఆ రెండు సినిమాల నష్టాల నుంచి కోలుకున్నానని ఆయన తెలిపారు. బాహుబలి1 నైజాం హక్కులను 25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశానని దిల్ రాజు వెల్లడించారు. సంక్రాంతి సినిమాలకు థియేటర్ల విషయంలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల తర్వాతే వారసుడుకు ప్రాధాన్యత ఉంటుందని దిల్ రాజు తెలిపారు.

సంక్రాంతి సినిమాలు విడుదలైన తర్వాత ఫలితాల ఆధారంగా థియేటర్ల సంఖ్యలో మార్పు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జనవరి నెల ఏడో తేదీ సమయానికి థియేటర్ల విషయంలో క్లారిటీ వస్తుందని దిల్ రాజు పేర్కొన్నారు. తన సొంత థియేటర్లను మాత్రం వారసుడుకే కేటాయించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. మైత్రీ నిర్మాతలకు ఏదైనా సమస్య ఉంటే నాతో మాట్లాడి పరిష్కరించుకోవచ్చని దిల్ రాజు కామెంట్లు చేశారు.

అన్ని సినిమాలు సక్సెస్ సాధించాలనే నేను కోరుకుంటానని ఆయన తెలిపారు. సంక్రాంతికి మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ కావడం సాధారణం అని దిల్ రాజు పేర్కొన్నారు. ఎఫ్3, శతమానం భవతి సినిమాలను అప్పట్లో దొరికినన్ని థియేటర్లలో విడుదల చేశానని ఆయన వెల్లడించారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus