Dil Raju, Rajamouli: మరో క్రేజీ ప్రాజెక్ట్ లో దిల్ రాజు హ్యాండ్!

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సినిమాలను నిర్మిస్తున్నారు. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. అలానే కోలీవుడ్ స్టార్ విజయ్ తో ఓ సినిమా లైన్లో పెట్టారు. ప్రభాస్, అల్లు అర్జున్ లతో కూడా ఆయనకు కమిట్మెంట్స్ ఉన్నాయి. ఈ రెండు సినిమాలను భారీ స్థాయిలోనే దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు దిల్ రాజు చేతుల్లోకి అనుకోకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి.

ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరో తెలుసా.. రాజమౌళి. మహేష్ బాబు హీరోగా జక్కన్న ఓ సినిమాను ప్లాన్ చేశారు. దీన్ని సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మించాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో దిల్ రాజు కూడా భాగస్వామి అవుతారని సమాచారం. గతంలో కేఎల్ నారాయణ మంచి సినిమాలనే నిర్మించారు. కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయి. ప్రొడక్షన్ తో పాటు బిజినెస్, డిస్ట్రిబ్యూషన్ అంతా మారాయి.

దీనికి తోడు సినిమాను వందల కోట్లతో నిర్మించాల్సి ఉంటుంది. దీంతో దిల్ రాజుని పార్ట్నర్ గా చేసుకున్నారట. ఇలాంటి ఛాన్స్ వస్తే దిల్ రాజు మాత్రం ఎందుకు వద్దనుకుంటాడు. అందుకే వెంటనే ఓకే చెప్పేశాడట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus