‘డిస్కో రాజా’ సెకండ్ సింగిల్ రివ్యూ..!

మాస్ మహా రాజ్ రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం ‘డిస్కో రాజా’. విఐ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రమేష్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు. నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. తాన్యా హాప్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 2020 జనవరి 24 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. తమన్ సంగీతంలో రూపొందిన మొదటి సింగిల్ ను ఇదివరకే రిలీజ్ చేయగా దానికి అద్భుతమైన స్పందన లభించింది. ఇక తాజాగా రెండో సింగిల్ ను కూడా విడుదల చేశారు.

‘డిల్లీ వాలా’ అంటూ సాగే ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా ఆదిత్య అయ్యంగర్, గీతామాధురి, రాహుల్ నంబియార్ వంటి క్రేజీ సింగర్స్ ఆలపించారు. ఈ పాటలో హీరో గురించి అతని వ్యక్తిత్వం గురించి వర్ణిస్తున్నట్టు స్పష్టమవుతుంది. చాలా క్లాస్ గా హీరో వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ సింగర్స్ చాలా ఇన్వాల్వ్ అయ్యి పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మంచి ఫామ్లో ఉన్నాడని ఈ పాట మరోసారి ప్రూవ్ అయ్యింది. పాత వినసొంపుగా చాలా బాగుంది.. మీరు కూడా ఓసారి వినెయ్యండి.


రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus