Dilraju: దిల్ రాజు పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ఒకవైపు నిర్మాతగా, మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు లిమిటెడ్ బడ్జెట్ సినిమాలపై దృష్టి పెట్టిన దిల్ రాజు ప్రస్తుతం స్టార్ హీరోలతో 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో సినిమాలను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. చరణ్ శంకర్ కాంబో మూవీ గేమ్ ఛేంజర్ బడ్జెట్ 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న (Dilraju) దిల్ రాజు ప్రభాస్, ఎన్టీఆర్ లతో రాబోయే రోజుల్లో సినిమాలను నిర్మిస్తానని వెల్లడించారు. వాస్తవానికి ప్రభాస్, ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. మరో మూడేళ్ల వరకు ఈ స్టార్ హీరోల డేట్స్ దొరకడం కూడా సులువు కాదు. పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే సత్తా ఉన్న డైరెక్టర్లను సెట్ చేస్తే మాత్రమే ప్రభాస్, ఎన్టీఆర్ లతో దిల్ రాజు సినిమాలు తెరకెక్కుతాయని చెప్పవచ్చు.

ఈ ఇద్దరు స్టార్స్ తో దిల్ రాజు ఎలాంటి సినిమాలను ప్లాన్ చేస్తారో చూడాలి. గత కొన్నేళ్లలో టాలీవుడ్ సినిమాల మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగిందనే సంగతి తెలిసిందే. హిట్ టాక్ వస్తే తెలుగు సినిమాలు సైతం సులువుగా 300 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి. ఇతర భాషల్లో సైతం టాలీవుడ్ స్టార్స్ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోలకు ఇతర భాషల్లో స్ట్రెయిట్ హీరోలకు సమానంగా మార్కెట్ ఉంది.

దిల్ రాజుకు ఈ మధ్య కాలంలో పలు సినిమాలతో షాకులు తగలగా సినిమాల బడ్జెట్ విషయంలో, కథల ఎంపిక విషయంలో దిల్ రాజు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలను నిర్మిస్తే మాత్రమే దిల్ రాజు కోరుకున్న విజయాలు అయితే దక్కుతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus