సంక్రాంతి రేస్ లో సేఫ్ గేమ్ ఆడుతున్న దిల్ రాజు

“దిల్, ఆర్య” టైమ్ లో నిర్మాతగా దిల్ రాజు ప్లానింగ్ మరియు పద్ధతులు చూసి బడా నిర్మాతలైన రామానాయుడు, సురేష్ బాబులు సైతం నివ్వెరపోయేవారట. ఆ ప్లానింగ్ తోనే తక్కువ కాలంలోనే అగ్ర నిర్మాతగా ఎదిగాడు దిల్ రాజు. అయితే.. గతేడాది మాత్రం ఆయనకు అంతగా అచ్చిరాలేదు. వరుస పరాజయాలు, భారీ నష్టాలతో కాస్త ఇబ్బందిపడ్డాడు. కానీ.. ఈ ఏడాది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ లాభాలు దక్కించుకోవాలన్న తపనతో ముందడుగు వేస్తున్నాడు.

అందుకే ఈ సంక్రాంతికి నిర్మాతగా మాత్రమే కాక డిస్ట్రిబ్యూటర్ గానూ భారీ లాభాలు దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. అందుకే.. తాను నిర్మాతగా రూపొందించిన “ఎఫ్ 2” చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తున్న దిల్ రాజు.. ఆ ముందు రోజు విడుదలవుతున్న రామ్ చరణ్ “వినయ విధేయ రామ” చిత్రం నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులు కూడా సొంతం చేసుకొన్నాడు. ఆల్రెడీ “ఎఫ్ 2″కి హిట్ టాక్ నడుస్తుండగా.. వినయ విధేయ రామ రిజల్ట్ ఎలా ఉన్నా, మొదటివారం కలెక్షన్స్ మాత్రం వీరలెవల్లో ఉంటాయనేది విశ్లేషకుల అంచనా. సో, ఈ సంవత్సరం ప్రారంభంలోనే దిల్ రాజు గట్టి బోణీ కొట్టనున్నాడన్నమాట. మరి దిల్ రాజు ప్లానింగ్ ఫలించి భారీ లాభాలు వస్తాయో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus