Dilraju: ఫుల్ స్వింగ్లో ‘మంగళవారం’ థియేట్రికల్ బిజినెస్!

ఆర్. ఎక్స్.100 చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అజయ్ భూపతి.. ఎన్నో ఆశలతో ‘మహాసముద్రం’ అనే సినిమా తెరకెక్కించాడు. కానీ ఆ సినిమా దారుణంగా నిరాశపరిచింది. కథ కొత్తగా ఉన్నా కథనం స్లోగా ఉండటంతో ప్రేక్షకులు ఆ చిత్రాన్ని ఆదరించలేదు.అయినప్పటికీ ఆ సినిమాలో మెయిన్ రోల్ చేసిన సిద్దార్థ్.. అజయ్ భూపతి గొప్ప టెక్నీషియన్ అని చెప్పడం జరిగింది. అయినా ఎవ్వరూ అజయ్ భూపతిని నమ్మలేదు.

అయితే త్వరలో అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మంగళవారం’ అనే రాబోతుంది. ఆల్రెడీ టీజర్, ట్రైలర్ లు రిలీజ్ అయ్యాయి. వాటికి సూపర్ రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ట్రైలర్లోని విజువల్స్ అయితే ‘కాంతార’ సినిమా రేంజ్లో ఉన్నాయి అని చెప్పొచ్చు. దీంతో అంచనాలు కూడా భారీగా పెరిగాయి. అందుకే ఈ సినిమాకి బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు రూ.10 కోట్ల పైనే థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది.

ముఖ్యంగా నైజాం హక్కులు (Dilraju) దిల్ రాజు, హరీష్ రెడ్డి.. లు సొంతం చేసుకున్నారట. ఒక్క నైజాంకే వారు రూ.3.4 కోట్లు చెల్లించినట్లు తెలుస్తుంది. ‘మంగళవారం’ సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ జరగడం అంటే మాటలు కాదు. ఓ చిన్న సినిమా టీజర్, ట్రైలర్లు కనుక ప్రేక్షకులను ఆకర్షిస్తే.. బిజినెస్ ఇంత బాగా జరుగుతుంది అనడానికి ‘మంగళవారం’ ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నవంబర్ 17 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus