Dilraju: ఓటీటీలోకి పై పుల్ క్లారీటీ ఇచ్చిన దిల్ రాజు టీమ్..!

కరోనా అనంతరం ఓటీటీల ప్రభావం బాగా పెరిగింది. ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ తో దూసుకుపోతున్నాయి. చాలా సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదలయ్యే పరిస్థితి వచ్చింది. ఓటీటీలో విడుదలైన సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రముఖులు ఓటీటీ రంగంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ రంగంలోకి అడుగు పెట్టారు. ‘ఆహా’ పేరుతో ఓటీటీ సంస్థను మొదలు పెట్టారు.

గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న సినిమాలతో పాటు పలు టాక్ షోలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. తెలుగు నాట ‘ఆహా’ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ రంగంలోకి మరో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. చిన్న సినిమాల కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపించింది. తాజాగా శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్‌ రాజు (Dilraju) ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన టీం ఖండించింది

కొంతకాలంగా ఆయన ఓటీటీని ప్రారంభించబోతున్నారని, చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ తీసుకురాబోతున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలను దిల్‌ నిర్మాణ సంస్థ ఖండించింది. నిజాలు తెలియకుండా అలాంటి వార్తలను సర్క్యులేట్‌ చేయవద్దని సోషల్‌ మీడియా వేదికగా కోరింది. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. ‘‘మా నిర్మాత దిల్‌రాజు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ తీసుకొస్తున్నారనే వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. నిర్థారణ కాని వార్తలను దయ చేసి ఎవరూ ప్రచురించవద్దు’’ అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఎక్స్‌ ఖాతాలో పేర్కొంది.

రూ.5కోట్లలోపు బడ్జెట్‌తో దాదాపు 25 చిన్న సినిమాలను నిర్మించి వాటిని ఓటీటీ వేదికగా విడుదల చేయాలని ఆలోచనలో దిల్‌ రాజు ఉన్నారని కొద్దిరోజులుగా టాక్‌ వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఈ ఓటీటీ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే దిల్‌ రాజు టీమ్‌ స్పందించింది. ప్రస్తుతం దిల్‌ రాజు నిర్మాణ సంస్థ నుంచి రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంతో తెరకెక్కుతోంది. అలాగే విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌ కాంబోలో ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం రూపొందుతోంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus