Dilruba Collections: ‘దిల్ రూబా’.. 25 శాతం కూడా రికవరీ కాలేదు!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘క’ (KA)  తర్వాత ‘దిల్ రూబా’ తో(Dilruba) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillon) ఇందులో హీరోయిన్. విశ్వ కరుణ్ (Vishwa Karun) దర్శకుడు. మార్చి 14న మంచి అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి షోతోనే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. నిర్మాతలు రవి, జోజో జోస్(Jojo Jose), రాకేష్ రెడ్డి (Rakesh Reddy)..లు ఈ సినిమాని ఓన్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు.

Dilruba Collections:

వీక్ డేస్ లో పరిస్థితి మరింత ఘోరం. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.40 Cr
సీడెడ్ 0.20 Cr
ఉత్తరాంధ్ర 0.21 Cr
ఈస్ట్ 0.08 Cr
వెస్ట్ 0.05 Cr
గుంటూరు 0.10 Cr
కృష్ణా 0.16 Cr
నెల్లూరు 0.06 Cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.26 Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.16 Cr
వరల్డ్ వైడ్ టోటల్ (టోటల్) 1.42 Cr (షేర్)

‘దిల్ రూబా’ చిత్రానికి రూ.8.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి వారం ఈ సినిమా కేవలం రూ.1.42 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.7.58 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus