Director Ajay Bhupathi: అజయ్ విషయంలో ఆ సెంటిమెంట్ నిజమైందా?

ఆర్.ఎక్స్.100 సినిమాతో అజయ్ భూపతి ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకున్నారు. చిన్న సినిమాగా విడుదలైన ఆర్.ఎక్స్.100 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హీరో కార్తికేయకు సైతం ఈ సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. ఆర్.ఎక్స్.100 నిర్మాతలకు కూడా భారీగా కలెక్షన్లు సాధించి మంచి లాభాలను అందించింది. ఆర్.ఎక్స్.100 సక్సెస్ తర్వాత అజయ్ భూపతికి ఆఫర్లు సైతం పెరిగాయి. అజయ్ భూపతి డైరెక్షన్ లో రెండో సినిమాగా మహాసముద్రం తెరకెక్కగా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

షూటింగ్ సమయంలో మహాసముద్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని శర్వానంద్ ఫ్యాన్స్, సిద్దార్థ్ ఫ్యాన్స్ భావించారు. ఈ సినిమాకు కలెక్షన్లు సైతం ఆశించిన స్థాయిలో లేవనే సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో తొలి సినిమాతో హిట్ సాధించిన డైరెక్టర్లకు రెండో సినిమాతో షాక్ తగులుతోంది. గతంలో పలువురు డైరెక్టర్ల విషయంలో ఈ విధంగా జరగగా అజయ్ భూపతి విషయంలో కూడా ఇదే సెంటిమెంట్ నిజం కావడం గమనార్హం. ధనుష్ అజయ్ భూపతి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఆ సినిమా ఆగిపోయినట్టే అని తెలుస్తోంది.

అజయ్ భూపతి తనను తాను మళ్లీ ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అజయ్ భూపతి తర్వాత సినిమాకు మరే హీరో అయినా ఓకే చెబుతాడేమో చూడాల్సి ఉంది. తరువాత సినిమాతో ఆర్.ఎక్స్ 100 మ్యాజిక్ ను రిపీట్ చేస్తే మాత్రమే అజయ్ భూపతికి ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus