Anil Ravipudi: ఆ విమర్శలపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఒకరైన అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమాకు అద్భుతంగా ప్రమోషన్స్ చేయడం కూడా ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందనే సంగతి తెలిసిందే. అయితే భగవంత్ కేసరి కలెక్షన్లు నిజం కాదంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. భగవంత్ కేసరి సినిమాకు సంబంధించి తాము ప్రకటించిన కలెక్షన్ల వివరాలు నిజమేనని ఎలాంటి ఫేక్ కలెక్షన్లను ప్రకటించలేదని ఆయన అన్నారు.

తాము ప్రకటిస్తున్న కలెక్షన్లు జెన్యూన్ అని వాళ్లు వెల్లడిస్తున్నారు. తమ కలెక్షన్లు నిజమో కాదో ప్రేక్షకుల రెస్పాన్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. అనిల్ రావిపూడి రెస్పాన్స్ తో భగవంత్ కేసరి గురించి నెగిటివ్ వార్తలు ఆగిపోతాయేమో చూడాలి. భగవంత్ కేసరి సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరగగా ఈ సినిమా ఆ అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకుని లాభాలను అందుకోవడం గమనార్హం.

భగవంత్ కేసరి సక్సెస్ తో అటు బాలయ్య, ఇటు  (Anil Ravipudi) అనిల్ రావిపూడి భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఈ ఇద్దరి పారితోషికాలు సైతం భారీ స్థాయిలో ఉన్నాయనే సంగతి తెలిసిందే. కథల ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్లే బాలయ్య, అనిల్ రావిపూడి వరుసగా విజయాలు అందుకుంటున్నారు. బాలయ్య ఎనర్జీ లెవెల్స్ చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాకవుతున్నాయి.

పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో బాలయ్య నటిస్తే మాత్రం బాలయ్య ఏ రేంజ్ హిట్లను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. బాలయ్య మోక్షజ్ఞ కాంబోలో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. భగవంత్ కేసరి తర్వాత బాలయ్య మరిన్ని పవర్ ఫుల్ రోల్స్ లో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus