సినిమాలు కానీ, ఆ సినిమాల ప్రచారం కానీ అనిల్ రావిపూడి లేటెస్ట్ ట్రెండ్‌ని ఫాలో అవుతూనే ఉంటాయి. అది యంగ్ హీరోతో తీసినా, సీనియర్ హీరోతో తీసినా ఆయన మార్కు పక్కాగా చూపిస్తారు. ఆఖరికి ప్రచారం విషయంలోనూ ఆయన స్టాంప్ వేస్తారు. తాజాగా అలాంటి ఓ ప్రయత్నం చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అదే అయితే ‘జైలర్ 2’ తరహాలో చిరంజీవి నెక్స్ట్ సినిమా ప్రకటన ఉంటుంది అని చెబుతున్నారు.
సాహు గారపాటి నిర్మాణంలో చిరంజీవి (Chiranjeevi) – అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. చిరంజీవి నుండి ఈ సినిమా అధికారికంగా ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ.. అనిల్ రావిపూడి, నిర్మాత అయితే వీలున్న ప్రతి చోటా ప్రకటించేస్తున్నారు. నిజానికి ఆ సినిమా ఉంది కూడా లెండి. అయితే ఆ సినిమా అనౌన్స్‌మెంట్ ట్రైలర్ స్థాయిలో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ మేరకు త్వరలో షూటింగ్ అని కూడా చెబుతున్నారు.
రీసెంట్‌గా వచ్చిన ‘జైలర్ 2’ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో చూసే ఉంటారు కదా. ఆ స్టైల్‌లోనే చిరంజీవి సినిమాను అనౌన్స్ చేసే ప్రయత్నాలు ఉన్నాయట. ఎమోషనల్ అంశాలున్న వినోదాత్మక సినిమా ఇది అని నిర్మాత సాహు గారపాటి (Sahu Garapati) అంటున్నారు. ఈ రెండూ మిక్స్ చేసే ఇప్పుడు ప్రమోషనల్ వీడియో షూట్ చేస్తారట. ఈ క్రమంలో సెల్ఫ్ సెటైర్లు కూడా ఉంటాయి అని చెబుతున్నారు.
ఇప్పటికే వంద శాతం స్ట్రయిక్ రేటుతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి.. చిరంజీవితో సినిమాకు ఎలాంటి కథ ఇస్తారు అనేది కాకుండా అనౌన్స్‌మెంట్ వీడియో ఎలా ఉండబోతోంది నే చర్చ మొదలైంది. ఎందుకంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా కోసం సోషల్ మీడియాలో ప్రచారం ఓ రేంజిలో చేశారు. ఆయనే నటిస్తూ, డ్యాన్స్ వేస్తూ కిందా మీదా పడుతూ ప్రచారం చేశారు. మరిప్పుడు చిరంజీవి సినిమా విషయంలో ఇలాంటివి ఇంకెన్ని చూస్తామో.