అనిల్ రావిపూడి డైరెక్షన్లో మహేష్ సినిమా ఫైనల్ అయినట్టేనా..?

ప్రతిష్టాత్మకంగా తెరెక్కుతున్న మహేష్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’ ఏప్రిల్ లో విడుదల కాబోతుంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్.వి.పొట్లూరి కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ కావడంతో ఈ చిత్రం పై అంచనాలు బానే ఉన్నాయి. మార్చి మొదటి వారానికి ఈ చిత్ర షూటింగ్ పూర్తవుతుందట. ఇక ఆ వెంటనే తన 26 వ చిత్రాన్ని సుకుమార్ డైరెక్షన్లో మొదలు పెట్టడానికి మహేష్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చక – చకా జరిగిపోతున్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడితో కూడా ఓ చిత్రాన్ని చేయడానికి మహేష్ రెడీ అవుతున్నాడట. ఇటీవల అనిల్ రావిపూడి… మహేష్ ను కలిసి కథను వినిపించడం .. దేనికి మహేష్ కూడా ఓకే చెప్పేయడం జరిగిపోయాయని టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబు సొంత బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి అనిల్ సుంకర నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించబోతున్నాడట. మహేష్ బాబు కి ’14 రీల్స్’ సంస్థతో ఓ చిత్రం చేయాల్సి ఉండడంతో.. అనిల్ కి అవకాశం ఇచ్చాడట మహేష్…! ఏదేమైనా ‘ఎఫ్2’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి .. మరో బంపర్ ఆఫర్ కొట్టేశాడని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus