Atlee, Allu Arjun: అట్లీ సినిమా కోసం వంద కోట్ల డీల్ కుదుర్చుకున్న అల్లు అర్జున్!

  • October 1, 2022 / 11:54 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మలయాళ భాషలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా సౌత్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఈ విధంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ కు ఎంతో మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇకపోతే పుష్ప సినిమా గత ఏడాది విడుదలైనప్పటికీ ఇంకా ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం ఇంకా షూటింగ్ పనులను ప్రారంభించలేదు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పుష్ప2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ కి అవకాశం ఇస్తారనే విషయంపై అల్లు అర్జున్ అభిమానులలో ఎంతో ఆత్రుత నెలకొంది.అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో చేయనున్నట్లు సమాచారం.

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ భార్య రెమ్యూనరేషన్ తీసుకోనున్నారు. ఈ సినిమా కోసం అల్లుఅర్జున్ కి ఏకంగా వందకోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది.

అయితే ఇందులో ఇంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే కనుక నిజమైతే అట్లీ ప్రస్తుతం షారుక్ ఖాన్ తో జవాన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus