Daaku Maharaaj: బాబీ కామెంట్స్ పై తమన్ క్లారిటీ ఇచ్చేశాడా..!

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)  హీరోగా బాబీ కొల్లి (Bobby) దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath) నటిస్తుండగా ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), చాందినీ చౌదరి  (Chandini Chowdary) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోకి కూడా ఛాన్స్ ఉందనే టాక్ మొన్నామధ్య నడిచింది. ఆ పాత్రలో దుల్కర్ సల్మాన్ లేదా విశ్వక్ సేన్ నటిస్తారనే టాక్ కూడా నడిచింది. కానీ విశ్వక్ సేన్ (Vishwak Sen) నేను చేయడం లేదు అని పరోక్షంగా చెప్పడం జరిగింది.

Daaku Maharaaj

ఇక దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) విషయంలో ఎటువంటి క్లారిటీ రాలేదు. మరి ఆ పాత్రని ఎవరు పోషిస్తున్నారు అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉండగా.. బాలయ్య మాస్ ఇమేజ్ కి ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ ఎలా పెట్టారు? అనే చర్చ ఇప్పుడు ఊపందుకుంది. కొంతమంది ఇది నెగిటివ్ టైటిల్ అని భావిస్తున్నారు. దీనికి దర్శకుడు బాబీ స్పందించి క్లారిటీ ఇచ్చాడు.

బాబీ మాట్లాడుతూ.. ” ‘పోకిరి’ (Pokiri) అనే టైటిల్ ను చూసి మనం రెస్పెక్ట్ అంటామా? లేక మాస్ అంటామా? ‘పోకిరి’ లో మహేష్ బాబు (Mahesh Babu) పోలీస్. తప్పు చేసిన వాళ్ళు తాటతీస్తా ఉంటాడు అని సినిమా చూశాక అర్థం చేసుకున్నాం. ‘డాకు మహారాజ్’ టైటిల్ కూడా సినిమా చూస్తేనే అర్థమవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ వెంటనే సంగీత దర్శకుడు తమన్ (S.S.Thaman).. ‘ఇంకో రెండు ఈవెంట్లకి నువ్వు కనుక వస్తే.. కథ మొత్తం చెప్పేస్తావ్’ అంటూ బాబీపై సెటైర్ వేశాడు. సో తమన్ కామెంట్స్ బట్టి.. ‘డాకు మహారాజ్’ కథ ‘పోకిరి’ కి దగ్గరగా ఉంటుందేమో అనే అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మరి అవి నిజమో కాదో.. 2025 జనవరి 12 కి క్లారిటీ వస్తుంది.

బాలయ్య 109 టైటిల్ టీజర్ వచ్చేసింది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus