Bobby,Chiranjeevi: చిరంజీవి – పవన్‌ కల్యాణ్‌ మీద బాబీ షాకింగ్‌ కామెంట్స్‌!

చిరంజీవి – రాజకీయాలు.. ఈ చర్చ ఇప్పటిది కాదు. ఆయన రాజకీయాలకు వెళ్తారు అనే వార్తలు వచ్చినప్పటి నుండి సాగుతూనే ఉంది. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు, రాజకీయాలు వదిలేసి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు కూడా సాగుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి ఆ విషయం మళ్లీ చర్చకొచ్చింది. ‘వాల్తేరు వీరయ్య’ వేదిక మీద చిరంజీవి – రాజకీయం గురించి ఆ సినిమా దర్శకుడు బాబీ కొన్ని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌ – రాజకీయం గురించి వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాలకు చిరంజీవి సరిపడరు అని అంటుంటారు చాలామంది అభిమానులు. ఆయన అభిమానిగా ఉండి, ఆ తర్వాత దర్శకుడిగా మారిన బాబీ కూడా ఇదే మాట అన్నారు. “అన్నయ్య మీకు రాజకీయాలు అసలు కరెక్ట్ కాదు. మీకు దేవుడు సరైన తమ్ముణ్ని ఇచ్చాడు. అతను రాజకీయాల్లో సమాధానం చెబుతాడు, గట్టిగా నిలబడతాడు. మీ ఆవేశం, మంచితనం కలిపితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” అంటూ రాజకీయాల విషయంలో మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడారు బాబీ.

బాబీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌కు కిక్కునిస్తాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల ఏపీ మంత్రి రోజా.. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌పై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బాబీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే బాబీ ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు చిరంజీవి అలానే చూస్తూ ఉన్నారు తప్ప.. ఎలాంటి స్పందన లేదు. అయితే అక్కడున్న అభిమానులు మాత్రం తెగ ఎంజాయ్‌ చేశారు. టీవీల్లో, యూట్యూబ్‌ల్లో చూసిన వాళ్లు సైతం ఎంజాయ్‌ చేసే ఉంటారు.

ఇంతకీ రోజా ఏమన్నారంటే…

చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురిని టార్గెట్ చేస్తూ ఇటీవల రోజా వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురినీ సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమవుతోందని రోజా ఆరోపించారు. సాధారణంగా నటులు సెన్సిటివ్‌గా ఉంటారు. అందరికీ సాయం చేస్తుంటారు. కానీ మెగా హీరోలు మాత్రం అందుకు భిన్నం. అందుకే రాజకీయాల్లో మెగా ముగ్గురుని ప్రజలు ఆదరించలేదని రోజా ఎద్దేవా చేశారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus