ఒకరు స్టార్ డైరెక్టర్. ఇంకొకరు చదరంగంలో పావులు కదపడంలో, ఎత్తుకు పైఎత్తు వేయడంలో స్పెషలిస్ట్. ఆయా రంగాల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న ఆ ఇద్దరు నిజ జీవితంలో బంధువులు కూడా. వాళ్లెవరో కాదు కె.ఎస్.రవీంద్ర అలియాస్ దర్శకుడు బాబీ, ద్రోణవల్లి హారిక అలియాస్ చెస్ ప్లేయర్ హారిక. బాబీ.. ‘పవర్’ తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘జై లవ కుశ’ ‘ వెంకీ మామ’ ‘వాల్తేరు వీరయ్య’ వంటి సినిమాలు తెరకెక్కించాడు బాబీ.
ఇందులో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ డిజాస్టర్ కాగా ‘జై లవ కుశ’ యావరేజ్ గా ఆడింది. మిగిలిన అన్ని సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. ఇక బాబీ, హారిక బంధువులు అనే సంగతి చాలా మందికి తెలియదు. రెండేళ్ల క్రితం వీరిద్దరూ ట్విట్టర్ స్పేస్ లోకి వచ్చి మాట్లాడుతుంటే.. అప్పుడు జనాలు గూగుల్ ను ఆశ్రయించి ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ద్రోణవల్లి హారిక అక్కనే బాబీ వివాహం చేసుకున్నాడు. ఆ రకంగా చెస్ ప్లేయర్ హారికకి.. (Bobby) బాబీ బావగారు వరసన్నమాట .
ఇదిలా ఉండగా.. హారిక 2018 లో కార్తీక్ చంద్ర అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి హన్విక అనే పాప పుట్టింది. నిన్న హన్విక మొదటి పుట్టినరోజు వేడుక అన్వయ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఎంతో మంది సెలబ్రిటీలు విచ్చేసి పాపని ఆశీర్వదించారు. ఆ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :