Director Buchi Babu: అలాంటి కథ చెబుతానన్న బుచ్చిబాబు!

వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా ఈ ఏడాది విడుదలై సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. అటు వైష్ణవ్ తేజ్ ఇటు కృతిశెట్టి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవడానికి ఒక విధంగా ఉప్పెన మూవీ కారణమని చెప్పవచ్చు. క్లైమాక్స్ లో షాకింగ్ ట్విస్ట్ ఉండటంతో ఉప్పెన మూవీ బాక్సాసీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వైష్ణవ్ తేజ్ ఏ డెబ్యూ హీరోకు సొంతం కాని రికార్డులను ఈ మూవీతో సొంతం చేసుకున్నారు.

అయితే బుచ్చిబాబు బ్లాక్ బస్టర్ హిట్ సాధించినా ఈ డైరెక్టర్ రెండో సినిమా ఫిక్స్ కాలేదు. ఎన్టీఆర్ కు బుచ్చిబాబు కథ చెప్పగా ఆ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ ఉంది. బుచ్చిబాబు తర్వాత సినిమాలో హీరో ఎవరనే సంగతి తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. అయితే ఈ డైరెక్టర్ ఉప్పెన సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మొదట ఉప్పెన 2 గురించి ఆలోచించి ఉప్పెన స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నానని బుచ్చిబాబు తెలిపారు.

ఉప్పెన2 సినిమాను కూడా బుచ్చిబాబు వైష్ణవ్, కృతి కాంబినేషన్ లో తెరకెక్కించే ఛాన్స్ ఉంది. తెలుగులో సీక్వెల్ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. ఉప్పెన2 ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాల్సి ఉంది. ఉప్పెన2 ప్రపంచంలో ఎవ్వరూ రాయని స్టోరీ అవుతుందని బుచ్చిబాబు చెప్పడం గమనార్హం.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus