Jr NTR: ఉప్పెన దర్శకుడికి విముక్తి లభించదా?

సుకుమార్ కు అత్యంత ఇష్టమైన శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన మొదటి సినిమా ఉప్పెనతో ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ఒక్క సినిమాతో అతని పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. ఇక మొదటి సినిమా సక్సెస్ కావడంతో మైత్రి మూవీ మేకర్స్ తోనే మరో సినిమా చేసేందుకు అతను కమిట్మెంట్ తీసుకున్నాడు. అయితే బుచ్చి బాబుతో సినిమా చేసేందుకు చాలా మంది హీరోలు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అతని ఫోకస్ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ పైనే ఉండటం విశేషం.

తదుపరి సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లాలి అని ఆలోచిస్తున్న బుచ్చిబాబు ఎలాగైనా ఎన్టీఆర్ ను ఒప్పించాలి అని బలంగా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంకా అతను చెప్పిన స్క్రిప్ట్ కు ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమాను మొదలుపెట్టనున్నాడు.

అయితే ఈ క్రమంలోనే బుచ్చిబాబు తో కూడా కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తాడని అనుకుంటే ఎన్టీఆర్ ఇంకా అతనికి ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రెండు మూడు సార్లు ఫుల్ స్క్రిప్టుతో బుచ్చిబాబు కథలును వినిపించినప్పటికీ కూడా ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు అని తెలుస్తోంది. RRR సినిమా తో పాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్ రిస్క్ తీసుకోకుండా కంటిన్యూగా బాక్సాఫీసు వద్ద తన రేంజ్ పెంచుకోవాలి అని అనుకుంటున్నాడు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రూట్లో మళ్ళీ వెనక్కి తగ్గకూడదని అనుకుంటున్న ఎన్టీఆర్ బుచ్చిబాబు విషయంలో కూడా వెంటనే ఒక నిర్ణయానికి రాలేక పోతున్నాడు. కానీ అతను మాత్రం ఇంకా ఎన్టీఆర్ కోసమే మళ్లీ మళ్లీ ఆ కథను మారుస్తున్నాడట. ఏ మాత్రం ఓపికను కోల్పోకుండా ఎన్టీఆర్ కోసమే సినిమా చేయాలి అని బుచ్చిబాబు మొండిపట్టు పట్టినట్లుగా తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus