Chandoo Mondeti: బాలీవుడ్ హీరోను డైరెక్ట్ చేయనున్న చందు మొండేటి?

నిఖిల్ కలర్ స్వాతి జంటగా నటించిన కార్తికేయ చిత్రం ద్వారా ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ చందు మొండేటి. ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కార్తికేయ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ద్వారక నగరం ఇతివృత్తంగా, సైన్స్‌ ఫిక్షన్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ వచ్చింది. ఈ సినిమా కేవలం సౌత్ ఇండియా కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకంగా 100 కోట్లను రాబట్టడంతో హీరో నిఖిల్ తో పాటు డైరెక్టర్ కు ఎంతో మంచి గుర్తింపు లభించింది. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చందుకు వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ చందు మాత్రం తన తదుపరి సినిమాని బాలీవుడ్ హీరోతో చేసే ఆలోచనలో ఉన్నారు.అత్యంత భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈయన సినిమా చేయబోతున్నారని

అయితే ఈ సినిమా టాలీవుడ్ హీరోలతో పాటు బాలీవుడ్ హీరోలతో చేయాలనే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం డైరెక్టర్ చందు తన తదుపరిచిత్రాన్ని హృతిక్ రోషన్ లేదా రణబీర్ కపూర్ తో చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా బాలీవుడ్ హీరో మాత్రమే కాకుండా టాలీవుడ్ హీరో కూడా ఇందులో నటిస్తూ భారీ బడ్జెట్ తో మల్టీస్టారర్ చిత్రాన్ని చేయాలనే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది

.మరి ఈయన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ వార్తలపై డైరెక్టర్ స్పందించాల్సి ఉంది. ఇకపోతే కార్తికేయ 2 సినిమా మంచి హిట్ కావడంతో కార్తికేయ 3 కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని నిఖిల్ కూడా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.మరి ఈయన సీక్రెట్ చిత్రంతో బిజీ అవుతారా లేదంటే కొత్త సినిమాతో బిజీ అవుతారా అనే విషయం తెలియాల్సి ఉంది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus