చంద్రశేఖర్ ఏలేటి హ్యాండ్ ఇవ్వడంతో షాకైన నితిన్

ఆయన తీసిన సినిమా ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించి ఉండకపోవచ్చు కానీ.. ఒక దర్శకుడిగా ఆయన ప్రతిభను ఎవరూ తక్కువగా అంచనా వేయలేరు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో స్క్రీన్ ప్లే ఎలాంటి ప్రేక్షకుడైనా ఫిదా అవ్వాల్సిందే. ఆయనే చంద్రశేఖర్ ఏలేటి. “మనమంతా” సినిమా తర్వాత ఆయనకి ఇప్పటివరకు మరో ఆఫర్ దక్కలేదు. అయితే.. మధ్యలో సాయిధరమ్ తేజ్, నితిన్ లతో సినిమా అంటూ న్యూస్ వచ్చినా ఇప్పటివరకు ఏదీ కన్ఫర్మ్ అవ్వలేదు. నితిన్ సినిమా త్వరలో మొదలవుతుంది అని న్యూస్ వచ్చినప్పటికీ.. ఇప్పుడు ఈ ప్రొజెక్ట్ లో భారీ మార్పులు వచ్చాయని తెలుస్తోంది.

చంద్రశేఖర్ ఏలేటి ఒక మంచి లవ్ స్టోరీ రాసుకొన్నాడట. ఈ కథనే నితిన్ చేత ఒప్పించి తెరకెక్కించేందుకు సన్నద్ధమయ్యాడు. నితిన్ కూడా వెంకీ కుడుములతో సినిమాకి ఫిక్స్ అయినప్పటికీ.. ఏలేటి కథ నచ్చడంతో రెండు సినిమాలు ఒకేసారి చేద్దామనుకున్నాడు. కానీ.. తాజా సమాచారం ప్రకారం చంద్రశేఖర్ ఇప్పుడు నితిన్ ను కాదని ఈ ప్రొజెక్ట్ ను రాణాతో తీద్దామనుకుంటున్నాడట. ఈమేరకు ఆల్రెడీ స్టోరీ డిస్కషన్స్ కూడా పూర్తయ్యాయట. మరి ఏలేటి హ్యాండ్ ఇచ్చాడు కాబట్టి నితిన్ ఉన్నపళంగా వెంకీ కుడుముల ప్రొజెక్ట్ మొదలెడితే బెటర్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus