బోయపాటి తరువాత ఆ డైరెక్టర్ నే ఫిక్స్ చేసిన బాలయ్య..?

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఇంకా ఫిక్స్ చెయ్యలేదు కానీ బాలయ్య బర్త్ డే రోజున.. ఆ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చెయ్యగా.. దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గతంలో బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’ ‘లెజెండ్’ చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. కాబట్టి ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక బోయపాటితో సినిమా పూర్తయిన తరువాత బి.గోపాల్ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి బాలయ్య ఓకే చెప్పినట్టు ప్రచారం జరిగింది.అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం.. బి.గోపాల్ డైరెక్షన్లో చిత్రం చెయ్యడానికి ఇప్పుడు బాలయ్య ఇంట్రెస్ట్ చూపించడం లేదట. బి.గోపాల్ డైరెక్షన్లో చెయ్యాల్సిన సినిమా బదులు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సినిమా చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాడట బాలయ్య. గతంలో పూరి- బాలయ్య కాంబినేషన్లో ‘పైసా వసూల్’ అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.ఆ చిత్రం పెద్దగా ఆడక పోయినా..

బాలయ్య ఫ్యాన్స్ ను ఆకట్టుకునే ఎన్నో ఎలిమెంట్స్ ను పూరి ఈ చిత్రంలో పెట్టాడు.అందుకే ఫేడౌట్ అయిపోయిన బి.గోపాల్ డైరెక్షన్లో సినిమా చెయ్యడం కన్నా పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో సినిమా చెయ్యడానికి బాలయ్య ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే బాలయ్య కోసం పూరి ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాసుకున్నాడట. ఈ మధ్యనే వీడియో కాల్ ద్వారా పూరి.. బాలయ్యకు కథ వినిపించాడట. స్కిప్ట్ కూడా నచ్చడంతో బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని సమాచారం.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus