Prabhas: ప్రభాస్ 25 గోల మళ్ళీ మొదలైంది.. అప్డేట్ డేట్ ఫిక్స్!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో కూడా ఈ స్థాయిలో అయితే అది పెద్ద సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకురాలేదు. ప్రభాస్ కెరీర్ లో చాలాకాలం తర్వాత ఒకేసారి మూడు ప్రాజెక్టులతో బిజీగా కావాల్సి వస్తోంది. అంతేకాకుండా కొత్త ప్రాజెక్టుల స్క్రిప్ట్ విషయంలో కూడా చర్చలు జరుపుతున్నాడు. చూస్తుంటే ప్రభాస్ మరో ఐదేళ్ల వరకు కూడా చాలా బిజీగా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక సంక్రాంతికి రాదేశ్యామ్ విడుదల అవుతుండగా ఆ తర్వాత సలార్ ఆదిపురుష్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరొకటి భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చాడు. ఇక ప్రభాస్ 20వ సినిమా ఎవరితో చేస్తారు అనే సందేహం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అక్టోబర్ 7న ప్రభాస్ 25 ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన అవకాశం ఉన్నట్లు కూడా టాక్ వస్తోంది.

ప్రస్తుతం రాజమౌళి RRR తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే మహేష్ బాబు తో కూడా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. బాహుబలి అనంతరం ప్రభాస్-రాజమౌళి కలయిక మరోసారి కలిసే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో కూడా న్యూస్ వైరల్ అవుతొంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే అక్టోబర్ 7 వరకు ఆగాల్సిందే.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus