అదే సేఫ్ గేమ్ అని భావిస్తున్న విక్టరీ వెంకటేష్..!

గతేడాది ‘ఎఫ్2’ తో బ్లాక్ బస్టర్.. అలాగే ‘వెంకీమామ’ తో ఓ హిట్ అందుకుని మంచి ఫామ్లో ఉన్నాడు మన విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో ‘అసురన్’ రీమేక్ అయిన ‘నారప్ప’ చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ 50శాతం పైనే పూర్తయ్యింది. ఇది వెంకటేష్ కు 74వ చిత్రం. ఈ క్రమంలో తన 75వ చిత్రాన్ని ఏ డైరెక్టర్ తో చేస్తాడు అనే చర్చ మొదలైంది. ఏ హీరో అయినా తన ల్యాండ్ మార్క్ చిత్రం మినిమం గ్యారెంటీగా చెయ్యాలని భావిస్తుంటాడు.

వెంకీ కూడా ఇప్పుడు అదే ప్లాన్ లో ఉన్నాడు. ఈ క్రమంలో వెంకటేష్ తన 75వ చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్షన్లో చేస్తాడని అంతా అనుకున్నారు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ నిర్మాణంలో వెంకటేష్- త్రివిక్రమ్ ల చిత్రం ఉంటుందని.. గతంలో అధికారిక ప్రకటన వచ్చింది. ఆ చిత్రంలో కాజల్ హీరోయిన్ అనే ప్రచారం కూడా జరిగింది. ‘వెంకటేష్ 75’ అదే అవుతుందని అంతా ఫిక్సయిపోయారు. అయితే త్రివిక్రమ్ ఇప్పుడు .. ‘ఎన్టీఆర్ 30’ స్క్రిప్ట్ పై బిజీగా ఉన్నాడు.

తరువాత పవన్ కళ్యాణ్ లేదా అల్లు అర్జున్ తో సినిమా చెయ్యాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. కాబట్టి త్రివిక్రమ్ తో వెంకీ సినిమా లేనట్టే..! ఈ నేపథ్యంలో వెంకటేష్ తో ‘ఎఫ్2’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం చేసిన దర్శకుడు అనిల్ రావిపూడితోనే ‘ఎఫ్3’ ఉంటుందని స్పష్టమవుతుంది. ఇక ఇదే ‘వెంకటేష్ 75’ అవ్వనుందని ఇన్సైడ్ టాక్.వెంకీ కూడా అలాంటి క్రేజీ మల్టీ స్టారరే సేఫ్ గేమ్ అని భావిస్తున్నట్టు సమాచారం.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus