Venkatesh: మైత్రి వాళ్ల ఇన్నాళ్ల వెతుకులాట ఇప్పుడు ముగిసిందా?

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అంతా బిజీగా ఉన్నారు. ఇటువైపు సీనియర్‌ స్టార్‌ హీరోలు, అటు వైపు కుర్ర స్టార్‌ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ, ఓకే చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఒక్క హీరో మాత్రం ‘కంగారేముందిలే..’ అనుకుంటున్నారు. అతనే విక్టరీ వెంకటేశ్‌. మామూలుగా వెంకీ నుండి సినిమాల గ్యాప్‌ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏమైందో ఏమో ఈ మధ్య వెంకీ బాగా స్లో అయ్యారు. అయితే ఆయన నెక్స్ట్‌ సినిమా విషయంలో కొత్త దర్శకుడు పేరు వినిపిస్తోంది,.

‘ధమాకా’ సినిమాతో తన జోనర్‌లో మంచి హిట్‌ కొట్టారు త్రినాథరావు నక్కిన. రవితేజకు, ఆయన ఫ్యాన్స్‌కు ఎంతో కిక్‌ ఇచ్చిన ఆయన.. తన తర్వాతి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌లో చేస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రాథమిక చర్చలు కూడా జరిగాయి అని అంటున్నారు. అయితే మైత్రీ వాళ్లు ఆ సినిమాను ఏ హీరోతో చేయొచ్చు అని చూస్తే.. వెంకటేశ్‌తో అని తెలుస్తోంది. వెంకీకి మైత్రీ టీమ్‌ చాలా రోజుల క్రితమే అడ్వాన్స్‌ ఇచ్చారు అని టాక్‌. ఇప్పుడు దానినే ఈ సినిమాగా మారుస్తారు అని అంటున్నారు.

అయితే ఇక్కడో విషయం ఏంటంటే.. ఇదివ‌రకే న‌క్కిన త్రినాథ‌రావు వెంకీకి ఓసారి క‌థ వినిపించేశారట. దీంతో ఇక కాల్ తీసుకోవాల్సింది వెంకటేశే అని అంటున్నారు. మరోవైపు ‘హిట్‌’ ద‌ర్శ‌కుడు శైలేష్ కొలను కూడా వెంకీకి ఓ కథ చెప్పారని వార్తలొచ్చాయి. అంతేకాదు ఆ క‌థ‌కు వెంకటేశ్‌ ప‌చ్చ‌జెండా ఊపాడని కూడా అంటున్నారు. ఇప్పుడు త్రినాథరావు న‌క్కిన ప్రాజెక్టు కూడా దాదాపుగా ఖాయ‌మ‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. మరోవైపు తరుణ్‌ భాస్కర్‌ ప్రాజెక్ట్‌ పెండింగ్‌లో ఉంది.

ఇదంతా చూస్తుంటే వెంకటేశ్‌ తిరిగి సినిమాలు షురూ చేస్తే వరుస పెట్టి సినిమాలు వస్తాయి అనిపిస్తోంది. అయితే అదెప్పుడు అనేదే అభిమానుల ప్రశ్న. ఎందుకంటే వేగంగా సినిమాలు చేసే వెంకీ ఇలా గ్యాప్‌ ఇవ్వడం ఆయన అభిమానులకు, ఇండస్ట్రీకి మంచిది కాదు అనేది నెటిజన్ల అభిప్రాయం. అయితే ఇక్కడో విషయం వీటిలో ఏ సినిమా ముందు స్టార్ట్‌ అవుతుంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus