ఏ పరిశ్రమలో అయినా అడుగు పెట్టడం కష్టమే.! అందుకు సినీ పరిశ్రమ అతీతం కాదు.సినిమా అనేది రంగుల ప్రపంచమే.! అయితే ఇక్కడ నెట్టుకు రావాలి అంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కావాలి అనేది పైకి తెలిసిన ఫార్ములా. కానీ ఇక్కడ అడుగుపెట్టిన వాళ్ళు చాలా అవమానాలు భరించాల్సి ఉంటుంది. ఇక్కడ అవకాశాలు కోసం వచ్చే వాళ్ళను పురుగుల్ని చూసినట్లు చూస్తారు మేకర్స్ అని ఇప్పటికే చాలా మంది మీడియా ముందు చెప్పుకొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ముఖ్యంగా యువతుల పరిస్థితి అయితే మరీ ఘోరం అని కొంతమంది సీనియర్ నటీమణులు చెబుతుంటారు. అయితే ఇప్పటి రోజులు మారాయి. ‘మీటూ’ ఉద్యమం తర్వాత చాలా మంది మహిళలు తమ జీవితంలో ఫేస్ చేసిన చీకటి కోణాలను బయటపెడుతున్నారు. అయితే ఇంకా అవకాశాలు పేరుతో దారుణమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పి యువతుల అశ్లీల దృశ్యాలు చిత్రీకరిస్తూ వారిని జీవితాలతో ఆడుకుంటూ వస్తున్న ఓ దర్శకుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
తమిళనాడు సేలంలో వేల్ క్షత్రియన్ అనే దర్శకుడు యాక్టింగ్ స్కూల్ రన్ చేస్తున్నాడు. అతని అసిస్టెంట్ జయ జ్యోతి తో కలిసి సీక్రెట్ కెమెరాల ద్వారా యువతుల అశ్లీల దృశ్యాలు చిత్రీకరించి.. ఆ తర్వాత తాను చెప్పినట్టు వినాలని యువతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అయితే విషయం తెలుసుకున్న ఓ యువతి సూరమంగళం మహిళా పోలీసులకు కంప్లైంట్ చేసింది.
దీంతో వేల్ క్షత్రియన్, అతని అసిస్టెంట్ జయ జ్యోతి ని ఇన్స్పెక్టర్ సుబ్బలక్ష్మి అరెస్ట్ చేసి విచారించింది.అప్పుడు దర్శకుడు వేల్ క్షత్రియన్ ఘోరాలు బయటపడ్డాయట. ఈ క్రమంలో 30కి పైగా హార్డ్ డిస్క్ లు, వాటిలో 300 మందికి పైగా అమ్మాయిల అశ్లీల వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన ఈరోజుల్లో కూడా ఇలాంటి ఘోరమైన సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తుండటం నిజంగా విచారకరం.
Most Recommended Video
‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర