Gunasekhar: గుణశేఖర్ ఆలోచన మారింది.. ఈసారి యూత్ ఫుల్ మూవీతో..!

గుణశేఖర్ (Gunasekhar) అంటే..ప్రేక్షకులకి పెద్ద పెద్ద సెట్లు గుర్తుకొస్తాయి.పెద్ద బడ్జెట్ సినిమాలు గుర్తుకొస్తాయి. చాలా మంది ఆయన్ని టాలీవుడ్ మణిరత్నం అంటుంటారు. అంత గొప్ప టెక్నీషియన్ ఆయన. ‘చూడాలని వుంది’ (Choodalani Vundi) ‘ఒక్కడు’ (Okkadu) ‘అర్జున్’ (Arjun) ‘రుద్రమదేవి’ (Rudrama Devi) ‘వరుడు’ (Varudu) వంటి సినిమాల్లో ఆయన వేయించిన సెట్స్ ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి అనడంలో అతిశయోక్తి కాదు. అయితే గత ఏడాది వచ్చిన ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమా గుణశేఖర్ కి చేదు ఫలితాన్ని ఇచ్చింది.

సమంత (Samantha) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచింది. టెక్నికల్ గా ఆకట్టుకునే అంశాలు ఉన్నప్పటికీ.. ఆ టైంలో అది ప్రేక్షకులకి రుచించలేదు. ఆ సినిమా ఇచ్చిన షాక్ వల్లో ఏమో కానీ… ఆయన ఏడాది కాలం పాటు ఇంకో సినిమా చేయలేదు. గ్యాప్ తీసుకుంటూ వచ్చారు. మొత్తానికి ఈరోజు తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు గుణశేఖర్. ‘యుఫోరియా’ అనే టైటిల్ తో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు.

ఇది ఒక యూత్‌ఫుల్ సోషల్ డ్రామా అని సమాచారం. ‘గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్’ బ్యాన‌ర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొదలయ్యాయి. త్వ‌ర‌లోనే షూటింగ్ ను ప్రారంభిస్తారు.అయితే ఇప్పటివరకు ఎక్కువగా స్టార్స్ తో సినిమాలు చేస్తూ వచ్చిన గుణశేఖర్..

ఈసారి మాత్రం అంతా కొత్త వాళ్ళతో ‘యుఫోరియా’ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే న‌టీన‌టుల వివరాలు వెల్లడిస్తారు. ఈ చిత్రంతో గుణశేఖర్ హిట్టు కొట్టి మళ్ళీ ఫామ్లోకి వస్తారేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus