టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హరీష్ శంకర్ (Harish Shankar) లేటెస్ట్ మరో హీరో కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రీసెంట్‌గా రవితేజతో (Ravi Teja) చేసిన మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌తో (Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేసిన, కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం హోల్డ్‌లోకి వెళ్లింది. పవన్ రాజకీయ ప్రస్థానం కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతుండగా, హరీష్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం.
మొదట్లో రామ్ పోతినేని (Ram) కోసం స్క్రిప్ట్ రాయడం జరిగినప్పటికీ, ఆ కాంబో వర్కౌట్ కాలేదు. దీంతో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కోసం హరీష్ స్క్రిప్ట్ ఫైనల్ చేస్తున్నారని పరిశ్రమలో చర్చ జరుగుతోంది. బాలయ్య-హరీష్ కాంబోపై చాలా కాలంగా ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇటీవల మలయాళంలో హిట్ అయిన ఆవేశం రీమేక్‌ను బాలకృష్ణతో చేయనున్నారని టాక్ వచ్చింది. ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) చేసిన పాత్రను తెలుగులో బాలయ్య అయితే న్యాయం చేస్తారని అభిప్రాయాలు వెలువడ్డాయి.
కానీ ఆ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే బాలయ్య రీమేక్ చేసే ఆలోచనలో లేరని కూడా టాక్ వస్తోంది. ఇక హరీష్ తో ఇటీవల, యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మియించేందుకు ముందుకువచ్చినట్లు సమాచారం. హరీష్ స్క్రిప్ట్ పూర్తి చేసి బాలయ్యకు కథ వినిపించనున్నారని, ఆ తర్వాతే సినిమా ఫైనల్ అవుతుందని టాక్.
ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడితే, హరీష్ శంకర్ కెరీర్‌లో మరో మాస్ ఎంటర్టైనర్‌గా నిలవనుంది. బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహారాజ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలవనున్నారు. ఒకవేళ, హరీష్ స్క్రిప్ట్ బాలయ్యకు నచ్చితే, ఈ కాంబో త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.