Pooja Hedge: పూజా హెగ్డే బర్త్ డే స్పెషల్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గబ్బర్ సింగ్ వంటి సినిమాతో ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న హరీష్ శంకర్ ఈ సినిమా తర్వాత ఈ స్థాయిలో సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాను ప్రకటించారు.

ఇక ఈ సినిమా కూడా త్వరలోనే షూటింగ్ పనులను ప్రారంభించి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని గతంలో ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ విడుదల చేయలేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాని పూర్తిగా పక్కన పెట్టేసారని అభిప్రాయం కూడా ఏర్పడింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డేని హీరోయిన్ గా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.

అయితే పూజ హెగ్డే పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ ఆమెకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవతీయుడు భగత్ సింగ్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే హరిశ్ శంకర్ పూజా హెగ్డేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా త్వరలోనే మీతో కలిసి సెట్ లో వర్క్ చేయడానికి ఎదురుచూస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

ఇలా ఈయన ట్వీట్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే షూటింగ్ ప్రారంభం కాదు అనుకున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా త్వరలోనే షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలియడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus