రవితేజ (Ravi Teja), హరీష్ శంకర్ (Harish Shankar) ..ల కలయికలో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) సినిమా ఇటీవల రిలీజ్ అయ్యింది. సినిమాకి మంచి టాక్ వచ్చింది. బి,సి సెంటర్ ఆడియన్స్ లో కొంతమంది ఈ సినిమాకి పాజిటివ్ టాక్ చెప్పారు.కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా సత్తా చాటడం లేదు. సినిమాలోని సాంగ్స్ అయితే ‘ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్’ ని ఆకట్టుకున్నాయి. విజువల్ గా కూడా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో లెంగ్త్ ఎక్కువైందనే కంప్లైంట్ ఉంది. దానికి టీం కూడా రెస్పాండ్ అయ్యి.. 13 నిమిషాలు ట్రిమ్ చేయడం కూడా జరిగింది.
మరోపక్క త్రివిక్రమ్ ((Trivikram) అభిమానులు ఈ సినిమా పై పగబెట్టుకుని విమర్శలు గుప్పించడం వంటివి మనం చూస్తున్నాం. ఎందుకంటే.. ఈ సినిమాలో గురూజీ అనే క్యారెక్టర్ ఉంది. ప్రభాస్ శీనుతో (Prabhas Sreenu) ఆ పాత్ర చేయించాడు దర్శకుడు హరీష్. ఇది దర్శకుడు త్రివిక్రమ్ పై సెటైరికల్ గా ఉందని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో గురూజీ అని పిలుచుకునేది త్రివిక్రమ్ నే..! అభిమానులు కూడా త్రివిక్రమ్ ని గురూజీ అని పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి త్రివిక్రమ్ పై ‘మిస్టర్ బచ్చన్’ లో ‘సెటైర్లు వేశాడు హరీష్ శంకర్’ అనేది కొందరి వాదన.
వీటిపై హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు. ‘నేను అమితంగా అభిమానించేది త్రివిక్రమ్ గారిని. నాకు డైలాగ్స్ విషయంలో స్ఫూర్తి ఆయనే..! మా నాన్నగారికి కూడా త్రివిక్రమ్ అంటే చాలా అభిమానం. మా ఇంట్లో త్రివిక్రమ్ గారు పెద్ద కొడుకులాంటి వారు. ఆయన్ని చూసి నేర్చుకో అంటూ మా నాన్నగారు నాకు క్లాస్ పీకిన సందర్భాలు అనేకం. సినీ పరిశ్రమలో త్రివిక్రమ్ గారి మార్క్ ఎప్పటికీ ఉంటుంది. అలాంటి వ్యక్తితో నాకు వివాదాలేంటి. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలు చూసి నవ్వుకోవడం తప్ప చేయడానికేమి ఉండదు’ అంటూ చెప్పుకొచ్చాడు హరీష్.
అంతా బాగానే ఉంది..! మరి ‘హరీష్ కి త్రివిక్రమ్ కి మనస్పర్థలు’ అంటూ ఎందుకు ప్రచారం మొదలైంది? అంటే… ‘హరీష్- పవన్ కళ్యాణ్ సినిమాకి.. త్రివిక్రమ్ అడ్డుపడ్డారని, తనకి డేట్స్ ఇవ్వకుండా పవన్ ని డైవర్ట్ చేసాడని, అందుకే త్రివిక్రమ్ పై హరీష్ కోపం పెంచుకుని.. ‘మిస్టర్ బచ్చన్’ ద్వారా త్రివిక్రమ్ పై సెటైర్లు వేసి పగ తీర్చుకున్నట్టు’ ఆ ప్రచారం యొక్క సారాంశం అనమాట..!