గార్గేయి యల్లాప్రగడ ‘హలో మీరా’ టీజర్ ను లాంచ్ చేసిన హరీష్ శంకర్

సింగిల్ క్యారెక్టర్, డిఫరెంట్ స్టోరీ లైన్ తీసుకొని హలో మీరా అంటూ ఓ కొత్త తరహా థ్రిల్లింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు కాకర్ల శ్రీనివాసు. ఎలాంటి భారీ తారాగణాన్ని ఎంచుకోకుండా ప్రయోగాత్మక కథతో ఈ మూవీ ప్లాన్ చేసి షూట్ చేశారు. ప్రముఖ దర్శకులు శ్రీ బాపు గారితో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన అనుభవాన్ని రంగరించి ఈ సినిమా రూపొందిస్తున్నారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు. ఈ మేరకు ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచిన మేకర్స్.. తాజాగా టీజర్ వదిలి సినిమాపై అంచనాలు పెంచేశారు.

ఫేమస్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా ఈ హలో మీరా టీజర్ రిలీజ్ చేశారు. ఈ వీడియో చూసిన హరీష్ శంకర్.. ఈ మూవీ ఎంతో ఆసక్తికరంగా ఉండటమే గాక వైవిధ్యభరితంగా ఉండనుందని ఈ టీజర్ ద్వారా తెలిసిపోతోందని చెప్పారు. ఈ మేరకు చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇకపోతే ఒక నిమిషం 16 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ హలో మీరా టీజర్ లో సినిమా సోల్ చూపిస్తూ ఆసక్తి రేకెత్తించారు. మీరా అనే సింగిల్ క్యారెక్టర్, ఆమెకు వచ్చే ఫోన్ కాల్స్ అందులోని ట్విస్టులు ఈ మూవీ కథపై ఇంట్రెస్ట్ నెలకొల్పాయి. పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి రాత్రికి రాత్రి ఆ పెళ్లి కాదనుకొని కారులో హైదరాబాద్ బయల్దేరడం, ఇంతలో అమ్మానాన్న, ఫ్రెండ్స్, లవర్, పోలీసుల నుంచి ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడం.. దాంతో మీరా పరిస్థితి ఏమైంది అనే కాన్సెప్ట్ తో థ్రిల్లింగ్ గా ఈ మూవీ ఉండనుందని టీజర్ స్పష్టం చేసింది.

హలో మీరా అనే క్యాచీ టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో రూపొందిస్తున్నారు. చిత్రంలో మీరాగా గార్గేయి యల్లాప్రగడ నటించారు. డా : లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరించగా.. ఎస్ చిన్న సంగీతం అందించారు. ప్రశాంత్ కొప్పినీడి సినిమాటోగ్రఫీ అందించారు. అనంత శ్రీధర్ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. తిరుమల ఎం తిరుపతి పొడక్షన్ డిజైనర్ గా, కత్రి మల్లేష్ , M రాంబాబు [చెన్నై] ప్రొడక్షన్ మేనేజర్స్ గా పని చేశారు. హిరన్మయి కళ్యాణ్ మాటలు రాశారు. రాంబాబు మేడికొండ ఎడిటర్ గా వర్క్ చేశారు. ప్రశాంత్ కొప్పినీడి అందించిన విజువల్స్ సినిమాలో హైలైట్ కానున్నాయట.

సింగల్ క్యారెక్టర్ తో డిఫరెంట్ ఎమోషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేయడం అనే ఓ ఛాలెంజింగ్ సబ్జెక్టుతో ఈ హలో మీరా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు. తొలి సినిమానే తనకు ఎంతో స్పెషల్ కావాలని “హలో మీరా” కథపై ఎన్నో కసరత్తులు చేసి అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా అవుట్ పుట్ తీసుకొస్తున్నారట. సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇవ్వడం పక్కా అంటున్నారు మేకర్స్. అతి త్వరలో ఈ డిఫరెంట్ మూవీని
గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus