Director Kalyan Krishna: బంగార్రాజు దర్శకుడికి మరో గోల్డెన్ ఛాన్స్

Advertisement

ఒక సినిమా సక్సెస్ అయితే దర్శకులకు మళ్ళీ వెంటనే అవకాశాలు రావడం చాలా కామన్. అయితే మరి కొందరు మాత్రం ఎంతో ఆలోచించి కొంత ఆలస్యంగా వారి తదుపరి సినిమాలను లైన్లోకి తెస్తూ ఉంటారు. ఇక సంక్రాంతి బెస్ట్ దర్శకుల్లో ఒకడిగా మంచి గుర్తింపును అందుకున్న కళ్యాణ్ కృష్ణ ఇటీవల మరో లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. బంగార్రాజు సినిమాతో 2022 సంక్రాంతికి విజేతగా నిలిచిన కళ్యాణ్ కృష్ణ బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు అందించే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ఈ దర్శకుడితో ఒక మంచి సినిమా చేయాలని నిర్మాతలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కళ్యాణ్ కృష్ణ ఆ తర్వాత నాగ చైతన్యతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా చేసి బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత మళ్లీ నేల టికెట్టు సినిమా తో బిగ్గెస్ట్ డిజాస్టర్ వచ్చింది. ఇక అతను ఫ్లాప్ లో ఉన్నప్పటికీ నాగార్జున బంగార్రాజు సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని ఇచ్చాడు.

ఇక నాగార్జునతో మరోసారి కళ్యాణ్ కృష్ణ ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ లోకి రప్పించే విధంగా బంగార్రాజు సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. మొత్తానికి ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇక కళ్యాణ్ కృష్ణ సౌత్ ఇండియా లో అతి పెద్ద బ్యానర్ లో ఒకటైన స్టూడియో గ్రీన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ విషయంలో అఫీషియల్ గా క్లారిటీ వచ్చేసింది. సూర్య కార్తీ లతో ఎక్కువగా సినిమాలు చేసే స్టూడియో గ్రీన్ సంస్థ లో కళ్యాణ్ కృష్ణ పవర్ఫుల్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు సమాచారం.

ఇటీవల ఈ దర్శకుడితో నిర్మాత జ్ఞానవేల్ రాజా ప్రత్యేకంగా చర్చలు జరిపి ఒక ప్రాజెక్టును ఫిక్స్ చేసుకున్నారట. అయితే ఆ కథలో ఎవరు నటిస్తున్నారు అనే విషయాలను మాత్రం ఇంకా బయటకు చెప్పలేదు. కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే అఫీషియల్ మరో అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus