Devara: కొరటాల శివ మాస్టర్ ప్లాన్.. పేర్ల వెనుక అలాంటి ట్విస్టులా?

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య సినిమా ఫ్లాప్ కావడం వల్ల తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆచార్య సినిమా కొరటాల శివకు ఆర్థికంగా కూడా సమస్యలు క్రియేట్ చేసిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే దేవర సినిమాతో మాత్రం కొరటాల శివ బాక్సాఫీస్ ను షేక్ చేసే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటాననే నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా జాన్వీకి సంబంధించి మరో లుక్ లీకైంది.

ఈ సినిమాలో జాన్వీ తంగం అనే పాత్రలో కనిపించనున్నారు. దేవర, భైరా, తంగం ఈ పేర్లు చూసిన నెటిజన్లు కొరటాల శివ మరీ కొత్తగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఈ పేర్ల వెనుక కూడా ట్విస్టులు ఉండవచ్చని కొరటాల శివ స్క్రిప్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

కొరటాల శివ ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా పాన్ ఇండియా లెవెల్ లో భారీ రేంజ్ లో ప్లాన్ చేయాలని అలా చేస్తే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భయానికే భయం పుట్టించే వీరుడి పాత్రలో తారక్ ఈ సినిమాలో కనిపించనున్నారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు పని చేస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయి.

దేవర (Devara) సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉండనుందని తెలుస్తోంది. తారక్ సరికొత్త లుక్ లో కనిపించనుండగా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ లు దేవర సినిమాలో అద్భుతంగా ఉన్నాయని ఈ సీక్వెన్స్ లు అదుర్స్ అనిపిస్తాయని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ మాస్ మసాలా రోల్స్ ను ఎంచుకుంటూనే బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus