Koratala Siva: ఆ సూచనలను సైతం పాటిస్తున్న కొరటాల శివ.. ఫ్యాన్స్ కు హామీ ఇస్తూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR)  పదేళ్ల క్రితం వరకు ఎక్కువ సంఖ్యలో మాస్ సినిమాలలో నటించగా టెంపర్ (Temper)  సినిమా నుంచి తారక్ రూట్ మార్చి కమర్షియల్ సక్సెస్ లను ఖాతాలో వేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ (Janatha Garage) మూవీ ఫ్యాన్స్ షోలు ప్రదర్శితం అయిన సమయంలో కొంతమేర నెగిటివ్ టాక్ వచ్చింది. ఫ్యాన్స్ కోరుకున్న స్థాయిలో మాస్ సీన్స్ లేకపోవడం వల్ల అలా జరిగింది.

Koratala Siva

అయితే అన్ని వర్గాల ఫ్యాన్స్ ను మెప్పించడంతో జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా హిట్ గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ కు సైతం ఈ సినిమా అప్పట్లో మంచి లాభాలను అందించింది. అయితే దేవర (Devara)  సినిమాకు సైతం అర్ధరాత్రి సమయంలోనే బెనిఫిట్ షోలు ప్రదర్శితం కానున్న సంగతి తెలిసిందే. అయితే దేవర మూవీ మాస్ ప్రేక్షకులను కచ్చితంగా మెప్పించే కథాంశంతో తెరకెక్కింది.

ఈసారి నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం అస్సలు ఉండదని ఫ్యాన్స్ కు కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుందని కొరటాల శివ (Koratala Siva) కాన్ఫిడెన్స్ తో ఉన్నారని తెలుస్తోంది. త్వరలో దేవర ప్రమోషన్స్ లో కొరటాల శివ పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. వరుస అప్ డేట్స్ తో దేవరపై రాబోయే రోజుల్లో అంచనాలు భారీగా పెరుగుతాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన దేవర ఫ్యాన్స్ ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ లో భాగంగా తర్వాత సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ తో పాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. దేవర సినిమాపై అంచనాలు పెరుగుతుండగా ఎన్టీఆర్ ఈ సినిమాతో కూడా అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అలాంటి కష్టాలు అనుభవించానని చెప్పిన పా. రంజిత్.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus