Pa Ranjith: అలాంటి కష్టాలు అనుభవించానని చెప్పిన పా. రంజిత్.. ఏమైందంటే?

  • September 2, 2024 / 08:19 PM IST

కోలీవుడ్ ఇండస్ట్రీలో భిన్నమైన సినిమాలతో దర్శకుడు పా. రంజిత్ (Pa Ranjith) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తాజాగా తంగలాన్ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న ఈ దర్శకుడు తన సినీ కెరీర్ గురించి, బాల్యంలోనే తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి కీలక విషయాలను చెప్పుకొచ్చారు. తనకు ఎదురైన అవమానాల గురించి సైతం పా. రంజిత్ వెల్లడించారు. ఊరిలో ఉన్న మర్రిచెట్టు అరుగుపై కూర్చుంటే నన్ను కిందికి తోసేశారని కిరాణ షాప్ లో చాక్లెట్ కోసం డబ్బులు ఇస్తే విసిరికొట్టారని తిరునాళ్లలో సహపంక్తి భోజనంలో కూర్చుంటే భోజనం మధ్యలో లేపి దూరంగా కూర్చోమని చెప్పారని పా. రంజిత్ తెలిపారు.

Pa Ranjith

మాది చెన్నై మహా నగరంలోని శివారు గ్రామమని మా ఊరి పేరు కర్రలపాలెమని ముగ్గురు అన్నాదమ్ముళ్లలో తాను రెండోవాడినని పా.రంజిత్ అన్నారు. నాకు ఎదురైన అవమానాలకు ప్రశ్నించేంత చైతన్యం చదువుతో వచ్చిందని పా. రంజిత్ తెలిపారు. అలాంటి అవమానాలు నాకు ఎదురైనా టీచర్లు మాత్రం వాళ్లు తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ నాకు పెట్టేవారని పా. రంజిత్ అన్నారు.

ఇంటర్ తర్వాత పై చదువులకు డబ్బులు లేక రైతు కూలీగా మారానని ఆయన అన్నారు. రెండేళ్లు కొంత డబ్బులు సంపాదించుకుని ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ లో చేరానని పా. రంజిత్ తెలిపారు. వెంకట్ ప్రభు దగ్గర అసిస్టెంట్ గా పని చేసి అట్టకత్తి అనే కథ రాశానని ఆ సినిమాను కోటీ 75 లక్షల రూపాయలతో తెరకెక్కిస్తే మూడు రెట్ల వసూళ్లు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు.

కాలా (Kaala), కబాలి (Kabali) , సార్పట్ట, తంగలాన్ (Thangalaan) సినిమాలతో ప్రేక్షకాదరణ పొందానని ఆయన వెల్లడించారు. తంగలాన్ నన్ను జాతీయ స్థాయిలో నిలబెట్టిందని ఆయన తెలిపారు. కుల రహిత సమాజమే నా లక్ష్యమని పా. రంజిత్ అన్నారు.

పరుచూరి వారసుడి టీజర్ లాంచ్.. ఇంత సాధాసీదాగానా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus