Koratala Siva: దేవర మూవీ చూసిన తర్వాత తారక్ రియాక్షన్ ఇదే.. కొరటాల కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో కొరటాల శివ  (Koratala Siva) ఒకరు కాగా ఈ దర్శకుడు దేవరతో (Devara) కచ్చితంగా సక్సెస్ అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మరికొన్ని గంటల్లో దేవర మూవీ థియేటర్లలో విడుదల కానుండగా ప్రమోషన్స్ లో భాగంగా కొరటాల శివ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దేవర సినిమాను ఇప్పటికే తారక్ నాలుగుసార్లు చూశారని ఫస్ట్ టైమ్ దేవర చూసిన వెంటనే తారక్ గట్టిగా హగ్ చేసుకుని సినిమా విషయంలో తన ఆనందాన్ని వ్యక్తపరిచారని తెలిపారు.

Koratala Siva

తారక్ కు (Jr NTR)  సినిమా నచ్చిందో లేదో అతని ఫేస్ చూస్తే అర్థమవుతుందని కొరటాల శివ చెప్పుకొచ్చారు. తారక్ రియల్ లైఫ్ లో నిజాయితీగా ఉంటారని నచ్చితే నచ్చిందని నచ్చకపోతే నచ్చలేదని చెబుతారని కొరటాల శివ చెప్పుకొచ్చారు. దేవర సినిమాకు సంబంధించి టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రం ఈ సినిమా రేంజ్ మారడం పక్కా అని చెప్పవచ్చు. దేవర సినిమా టాక్ మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

అటు ఓవర్సీస్ లో ఇటు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఒకే సమయంలో ప్రదర్శితం కానుండటం ఈ సినిమాకు ప్లస్ కానుందని చెప్పవచ్చు. దేవర సినిమా కచ్చితంగా హిట్ గా నిలుస్తుందని సెకండాఫ్ ఈ సినిమాకు హైలెట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. 12 సంవత్సరాల మధ్య జరిగిన సంఘటనలకు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లాన్స్ వావ్ అనేలా ఉండగా వరుస సినిమాలలో నటించడంతో పాటు ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యేలా తారక్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. 2025లో వార్2, 2026లో ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమాలతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయనున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

దేవరలో మ్యూజిక్ కు ప్రత్యేక స్థానం.. అనిరుధ్ చెప్పిన విషయాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus