బాగా రాని సన్నివేశాన్ని రీ షూట్ చేస్తున్న క్రిష్!

సినిమానే జీవితం.. సినిమా తర్వాతే ఏదైనా అని భావించే తెలుగుదర్శకుల్లో క్రిష్ ఒకరు. అతను చేతిలో రెండు ప్రతిష్టాత్మక ప్రాజక్ట్స్ ఉన్నాయి. మొదటిది వీరనారి రాణీ లక్ష్మీ భాయ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న మణికర్ణిక అనే మూవీ. ఇందుకోసం బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథని సమకూర్చారు. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌ లక్ష్మీ భాయ్‌ గా నటిస్తున్న ఈ సినిమా ఏకకాలంలో మూడు భాషల్లో నిర్మితమవుతోంది. ఈ చిత్ర ప్రొడక్షన్ వర్క్ ని గత నెలల్లోనే క్రిష్ కంప్లీట్ చేశారు. మణికర్ణిక చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులు ప్రారంభించి నందమూరి తారక రామారావు బయోపిక్ సినిమా బాధ్యతలు తీసుకున్నారు. రీసెంట్ గా ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. మనదేశంలో ఎన్టీఆర్ నటించే సన్నివేశాన్ని బాలకృష్ణపై చిత్రీకరించారు.

ఇంకా ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతుందని అనుకుంటే క్రిష్ కి ఓ చిక్కువచ్చి పడింది. మణికర్ణిక సినిమాని ఎడిట్ చేసి చూసుకుంటే ఒక సీన్ క్రిష్ కి నచ్చలేదట. అందుకే రీషూట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కారణంగా బడ్జెట్‌ మరో ఐదు కోట్లు పెరిగినట్లు సమాచారం. జీ స్టూడియోస్, కమల్ జైన్ సమర్పణలో కైరోస్ కంటెంట్ స్టూడియోస్ బ్యానర్లో సంజయ్ కుట్రీ, నిషాద్ పిట్టి  నిర్మిస్తున్న ఈ మూవీ అద్భుతంగా రావాలని క్రిష్ కాంప్రమైజ్ కావడం లేదు. అందుకే మరో ఐదుకోట్ల ఖర్చుతో సినిమాని కంప్లీట్ చేయడానికి ఫిక్స్ అయిపోయారు. ఇది పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ లో బిజీ కానున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus