సీనియర్ స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీకి (Krishna Vamsi) చాదస్తం బాగా ఎక్కువ. తాను ఒకటి అనుకుంటే.. అది చేసెయ్యాలి. లేదు అంటే మానేస్తాడు. అంతేకానీ రాజీపడి ఇంకో విధంగా చేయడు. ఈ విషయం కృష్ణవంశీతో సినిమాలు చేసిన నిర్మాతలకి బాగా తెలుసు. ‘మురారి’ సినిమా విషయంలో నిర్మాతలు దేవి ప్రసాద్, రామలింగేశ్వరరావు ఎన్ని మార్పులు సూచించినా కృష్ణవంశీ ససేమిరా చేసింది లేదు. పాటల విషయంలో కూడా కృష్ణవంశీ తగ్గింది లేదు. అవసరమైతే డైరెక్టర్ గా తన పేరు తీసేయమని నిర్మాతకి తెగేసి చెప్పారు.
Krishna Vamsi
ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.. కృష్ణవంశీ గతంలో ప్రభాస్ కోసం ఓ మాస్ కథ రాసుకున్నారు. కానీ ప్రభాస్ మాత్రం తనకు క్లాస్ టచ్ ఉన్న సినిమా కావాలంటే ‘చక్రం’ చేశాడు కృష్ణవంశీ. అది ఆడలేదు. కానీ ప్రభాస్ కోసం రాసుకున్న కథ తన వద్ద అలానే ఉందట. ‘ఖడ్గం’ రీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా కృష్ణవంశీ ఈ విషయాలు చెప్పుకొచ్చాడు.
‘ప్రభాస్ కోసం రాసుకున్న మాస్ కథ ఇప్పటికీ అలానే ఉంది. ప్రభాస్ కి తప్ప అది ఎవ్వరికీ సూట్ అవ్వదు. తీస్తే ప్రభాస్ తోనే తీస్తా. కానీ అది జరిగే పని కాదు. ప్రభాస్ ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీగా ఉన్నాడు. నేనేమో అనుకుంటే రేపే సెట్స్ పైకి వెళ్లిపోయే రకం. అందుకే సెట్ అవ్వదు. కానీ నేను తప్ప ఆ కథ ఇంకొకరికి ఇచ్చి డైరెక్ట్ చేసే ఆలోచన నాకు లేదు’ అంటూ కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు.