దర్శకుడు కృష్ణవంశీతో (Krishna Vamsi) సినిమా అంటే ఒకప్పుడు నిర్మాతలు ఎగబడేవారు. కానీ కృష్ణవంశీ అందరి నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్లకు నచ్చిన సినిమా చేయడం ఇష్టం లేక ఆచి తూచి సినిమాలు తీసేవారు. అందులో చాలా సినిమాలు హిట్టయినా… ప్లాపైనా మంచి సినిమా తీశాడు, గుర్తుండిపోయే సినిమా తీశాడు కృష్ణవంశీ అని అంతా మెచ్చుకునేవారు.కృష్ణవంశీ హానెస్టీకి సలాం కొట్టే అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. కానీ ‘పైసా’, ‘గోవిందుడు అందరివాడేలే’ ‘నక్షత్రం’ వంటి సినిమాలు ఆయనకు బ్యాడ్ నేమ్ తెచ్చిపెట్టాయి.
అలా అని ఆయన స్థాయి తగ్గిపోలేదు. ఆయన మార్క్ సినిమా ఎప్పటికైనా తీస్తాడు అని నమ్మిన వాళ్ళు ఉన్నారు.ఆ నమ్మకం ‘రంగమార్తాండ’ రూపంలో నిజమైంది. సినిమా పై ఉన్న కాన్ఫిడెన్స్ తో కృష్ణవంశీ ఇండస్ట్రీలో చాలా మందిని పిలిచి షోలు వేశాడు. అందరూ సినిమా చూసి ప్రశంసలు కురిపించారు. ఇక మార్చ్ 22న థియేటర్లలో రిలీజ్ అయిన ‘రంగమార్తాండ’ చిత్రం ప్రేక్షకులతో కూడా మంచి మార్కులు వేయించుకుంది.
కానీ కొందరు పాతకాలం సెంటిమెంట్, ఎమోషన్ అంటూ కామెంట్లు చేశారు. కానీ అప్పటికే వచ్చిన పాజిటివ్ బజ్ ముందు ఆ నెగిటివ్ కామెంట్లు నిలబడలేదు. తర్వాత బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు లేవు అని చాలామంది కామెంట్లు చేశారు. సినిమాకి జరిగిన బిజినెస్ రీత్యా, తక్కువ థియేటర్లలో కూడా ఈ మూవీ మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ వీకెండ్ కు 80 శాతం రికవరీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కృష్ణవంశీ పాసైపోయినట్టే..! హ్యాపీగా ఆయన తన నెక్స్ట్ సినిమాకి రెడీ అయిపోవచ్చు..!
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?