‘గులాబీ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కృష్ణవంశీ.. రెండో చిత్రం ‘నిన్నే పెళ్ళాడతా’ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలాంటి మూవీ తర్వాత ఆయనతో పని చేయడానికి చాలా మంది స్టార్ హీరోలు ఆసక్తి చూపించారు. అప్పటి నుండి పక్కా కమర్షియల్ సినిమాలు లేదా ఫ్యామిలీ సినిమాలు ఆయన తీస్తాడు అని అంతా భావించారు. కానీ కృష్ణవంశీ మాత్రం ‘సింధూరం’ అనే నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశాడు.
బ్రహ్మాజీ, రవితేజ, సంఘవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం 1997 వ సంవత్సరంలో సెప్టెంబర్ 12న రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి చాలా మంచి రివ్యూలు వచ్చాయి. కానీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ సినిమాలో పాటలు గాని, డైలాగులు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. కథలో చాలా ఎమోషన్ దాగి ఉంటుంది. కొంతమందికి ఈ సినిమా నచ్చింది. అయితే ఇంకొంతమంది మాత్రం కృష్ణవంశీ తెరకెక్కించిన ‘నిన్నే పెళ్ళాడతా’ చూసిన కళ్ళతో ఈ మూవీని చూడలేకపోయారు.
అందుకే ఈ సినిమా కమర్షియల్ గా ప్లాప్ అయ్యింది. ‘ఆంధ్రా టాకీస్’ బ్యానర్ పై ముళ్ళపూడి మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పాత సినిమాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తున్న తరుణంలో ‘సింధూరం’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయమని కోరాడు. ‘కృష్ణవంశీ గారు ఒక్కసారి సింధూరం సినిమా రిలీజైతే నా లాంటి చాలా మంది 4 షోస్ చూడటానికి సిద్ధంగా ఉన్నాము సార్…. దయచేసి ఈ మా ఆశ నెరవేర్చాలని కోరుతున్నాము సార్..
“నా జీవితంలో నేను చూసిన గొప్ప సినిమా సింధూరం”..మరణం లోపు మరల మరల చూడాలనిపించిన చిత్రం, వినాలి అనిపించే సంగీతం.” అంటూ ట్విట్టర్ కృష్ణవంశీని ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. ఇందుకు కృష్ణవంశీ బదులిస్తూ.. “అమ్మో.. 5 ఏళ్ళు అప్పులు కట్టాను అయ్యా.. వామ్మో ‘ అంటూ దణ్ణం పెట్టేశాడు”..! ‘సింధూరం’ సినిమా అప్పుల భారాన్ని తన పై వేసుకున్నట్టు కృష్ణవంశీ తెలిపాడు. ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
కృష్ణవంశీ గారు ఒక్కసారి సింధూరం సినిమా రిలీజైతే నా లాంటి చాలామంది4 షోస్ చూడటానికి సిద్ధంగా ఉన్నాము సార్…. దయచేసి ఈ మా ఆశ నెరవేర్చాలని కోరుతున్నాము సార్..”నా జీవితంలో నేను చూసిన గొప్ప సినిమా సిందూరం”..మరణం లోపు మరల మరల చూడాలనిపించిన చిత్రం, వినాలి అనిపించే సంగీతం.@director_kv pic.twitter.com/dQPntTh47E
— Chandu Gummalla (@gummallachandu) January 3, 2023
Ammmmo.., five years అప్పులు కట్టేను ayyàaaa…. Wammmmmmoooooo
— Krishna Vamsi (@director_kv) January 3, 2023
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?