Krishna Vamsi: ఆ హీరోయిన్ కమర్షియల్ గా బిహేవ్ చేసేది.. కృష్ణవంశీ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో కృష్ణవంశీ (Krishna Vamsi) ఒకరు. ఈ మధ్య కాలంలో కృష్ణవంశీకి సరైన సక్సెస్ లేకపోయినా మంచి ప్రాజెక్ట్ తో వస్తే ఆయన సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడుతూ ఛార్మి (Charmy Kaur) గురించి, పేరు ప్రస్తావించకుండా మరో హీరోయిన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. కృష్ణవంశీ మాట్లాడుతూ తాను అభిమానించే హీరోయిన్లలో ఛార్మి ఒకరని చెప్పుకొచ్చారు.

ఛార్మి నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడం మాత్రం ఆమె బ్యాడ్ లక్ అని ఆయన తెలిపారు. ఎలాంటి పాత్ర అయినా, పాత్రకు అనుగుణంగా ఎక్స్ ప్రెషన్స్ అయినా ఛార్మి అద్భుతంగా పలికించగలదని కృష్ణవంశీ పేర్కొన్నారు. ఛార్మికి అంత టాలెంట్ ఉన్నా ఆశించిన స్థాయిలో సక్సెస్ లేదని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఒక హీరోయిన్ పేరు ప్రస్తావించకుండా అందరు హీరోయిన్లు ఫ్రెండ్లీగా ఉంటారని ఒకే ఒక హీరోయిన్ మాత్రం అలా లేరని అన్నారు.

ఆ హీరోయిన్ గురించి షూటింగ్ రెండో రోజే అర్థమైందని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. ఆమెతో నేను ఒకే ఒక్క సినిమా చేశానని కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆమెను ఆ సినిమాలో తీసుకోవాల్సి వచ్చిందని కృష్ణవంశీ వెల్లడించారు. ఆ హీరోయిన్ యాటిట్యూడ్ నాకు నచ్చేది కాదని కృష్ణవంశీ పేర్కొన్నారు. ఆ హీరోయిన్ కూడా కమర్షియల్ గా బిహేవ్ చేసేదని ఆయన తెలిపారు. కృష్ణవంశీ ఈ కామెంట్స్ ఇలియానా (ileana) గురించి చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

కృష్ణవంశీ రంగమార్తాండ (Rangamaarthaanda) తర్వాత కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించలేదనే సంగతి తెలిసిందే. కృష్ణవంశీ కెరీర్ పరంగా బిజీ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఆయన కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. కొత్తవాళ్లతో కృష్ణవంశీ సినిమాలను ప్లాన్ చేస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. కృష్ణవంశీ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus