సినిమా పరిశ్రమపై కరోనా ప్రతాపం మొదలైందా.. చిత్రీకరణ సమయంలో జాగ్రత్తల లేమి నటీనటులు, దర్శకుల్ని ఇబ్బంది పెడుతోందా? ఏమో వరుసగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇదే డౌట్ వస్తోంది. తెలుగులో ఇలాంటి కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా కోలీవుడ్‌లో మాత్రం ఒక్కొక్కటిగా కేసులు బయటికొస్తున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటివరకు ఎలాంటి బులిటెన్ రాలేదు.
మణిరత్నం ఇటీవల కరోనా బారిన పడ్డారని తెలిసిందే. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టేలా ఉండటంతో ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారట. ప్రస్తుతం ఆయన అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారట. మంగళవారం ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కోలీవుడ్‌లో ఇటీవల వరలక్ష్మీ శరత్ కుమార్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. సినిమా సెట్స్‌లో టీమ్ మాస్క్‌లు ధరించాలని పట్టుబట్టడం మంచిది అని ఆమె సూచించారు కూడా.
ఇక మణిరత్నం సినిమాల సంగతి చూస్తే.. ఆయన దర్శకత్వం వహించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ – 1’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. సినిమాను సెప్టెంబరు 30న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో విక్రమ్, ‘జయం’ రవి, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభితా ధూళిపాళ్ల తదితరులు ప్రధాన పాత్రధారులు. తెలుగు వెర్షన్ ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి మాటలు రాశారు.
మరోవైపు సినిమాపై వివాదాలు కూడా మొదలయ్యాయి. ‘పొన్నియిన్ సెల్వన్’లో చోళులు, చోళ రాజవంశాన్ని తప్పుగా చూపిస్తున్నారంటూ ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశారు. దాంతో మణిరత్నం, విక్రమ్ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో మణిరత్నం ఆస్పత్రిలో చేరడం గమనార్హం. ఇంతకుముందే విక్రమ్ ఛాతిలో సమస్యతో ఆస్పత్రి పాలయ్యారు. దాంతో ఆయన ‘పొన్నియిన్ సెల్వన్ – 1’ టీజర్ లాంచ్ వేడుకకు రాలేకపోయారు కూడా.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!